రాష్ట్రంలో గులాబ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. ముందస్తు జాగర్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ కొన్ని ప్రాణాలు కాపాడలేకపోయారు అధికారులు. కుండపోత వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. తీరం దాటే ప్రాంతాలలో మాత్రం ఇంకా ఉదృతంగా ప్రభావం చూపింది ఈ తుఫాన్. తెలుగు రాష్ట్రాలలో పట్టణాల పరిస్థితులు ఇంకా గోరంగా ఉన్నాయి. ఆయా పట్టణాలు చెరువులను మరిపిస్తున్నాయి. ఈ ఏడాది ఎన్నడూ లేని వర్షాలు పడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఒకప్పుడు తీరప్రాంతాల వారినే తుఫాను హెచ్చరికలు చేసేవారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో కూడా ప్రజలు బయటకు రావద్దనే హెచ్చరికలు చేస్తున్నారు ఆయా అధికారులు.

ఏపీలో శ్రీకాకుళంలో తీరం దాటిన తుఫాన్ ఆయా ప్రాంతాలలో తీవ్రంగా ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీచేయడంతో ప్రమాదం తప్పిందని వారు అంటున్నారు. అయినా కొన్ని చోట్ల వర్షాలకు భవనాలు కూలి ప్రమాదాలు సంభవించాయి. ఏపీసీఎం తుఫాన్ పై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ తుఫాన్  జరిగిన ప్రమాదాలలో మరణించిన వారికి ఇప్పటికే 5లక్షల పరిహారం ప్రకటించారు. తీరప్రాంతాల వారిని శిబిరాలకు తరలించారు. ఆయా శిబిరాలలో తలదాచుకున్న వారికి కనీస అవసరాలు అందించడంలో ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థల కు ప్రభుత్వం సెలవలు ప్రకటించింది. ఆయా జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, బాధితులకు మెరుగైన సహాయక చర్యలు అందిస్తున్నారు.

ఇక తెలంగాణాలో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల లో 18.2 సెం. మీ. వర్షపాతం పడినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీనితో వాతావరణ అధికారులు 14జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో పరిస్థితులను గురించి ఎప్పటికప్పుడు టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షిస్తూనే ఉన్నారు. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థల కు ప్రభుత్వం సెలవలు ప్రకటించింది. ఆయా జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, బాధితులకు మెరుగైన సహాయక చర్యలు అందిస్తున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలలో అధిక వర్షపాతం నమోదు అయ్యింది. మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

భారీ వర్షాల నేపథ్యంలో జలాశయాలు నిండుకుండలుగా మారిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాలలో విద్యుత్ సహా పలు అంశాలు పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన కొనసాగుతుంది. మరో రెండు రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయనే సూచనలు ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ఆయా ప్రాంతాలలో ప్రజలను ముందస్తుగా హెచ్చరిస్తూ ఉండాలని నేతలు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: