తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌రుస పెట్టి.. ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డుతున్నారు. నిజానికి గ‌డిచిన రెండేళ్లుగా మౌనంగా ఉన్న ప‌వ‌న్‌.. ఒక్కసారిగా విజృంభిస్తున్నారు. బీజేపీతో జ‌త‌క‌ట్టిన త‌ర్వాత‌.. ఆయ‌న మౌనంగానే ఉన్నారు. దీనిపై అప్ప‌ట్లోనే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. కేంద్రంలోని బీజేపీనేత‌ల‌తో ఏపీ సీఎం జ‌గ‌న్ ఆయ‌న పార్టీ నేత‌లు తెర‌చాటుగా చేతులు క‌లిపిన నేప‌థ్యంలో బీజేపీ మిత్ర‌ప‌క్షంగాఉన్న జ‌న‌సేనను కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు నిలువ‌రించార‌ని.. అందుకే ఆయ‌న మౌనంగా ఉంటున్నార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. దీనికి త‌గ్గ‌ట్టుగా.. ప‌వ‌న్ కూడా మౌనంగానే ఉన్నారు.

కేవ‌లం తిరుపతి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో మాత్రం కొంత మేర‌కు అది కూడా ఆచితూచి విమ‌ర్శ‌లు చేశారు. దేవాల‌యాల‌పై దాడులను అప్ప‌ట్లో టార్గెట్ చేశారు. అంత‌కుమించి ఆయ‌న ముందుకు పోలేదు. కానీ... ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫలితం త‌ర్వాత మాత్రం ఒక్క‌సారిగా పుంజుకున్నారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కొన్ని స్థానాలు ద‌క్కించుకుంది. సుమారు 180 వ‌ర‌కు ఎంపీటీసీల‌ను ద‌క్కించుకుంది. బ‌హుశ దీనిని గ్ర‌హించిన ప‌వ‌న్ ఇక‌, బీజేపీతో ఉంటే క‌లిసి రాద‌ని.. వ‌ర్క‌వుట్ కాద‌ని నిర్ణ‌యించుకుని ఉంటార‌నే చ‌ర్చ జ‌న‌సేన‌లో జ‌రుగుతోంది. అంతేకాదు..త‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని.. ఆయ‌నే స్వ‌యంగా చెబుతున్నారు.

సో.. దీనిని దృష్టిలో ఉంచుకునే రిప‌బ్లిక్ సినిమా ఫంక్ష‌న్ నుంచి ఆయ‌న వ‌రుస‌గా జ‌గ‌న్ స‌ర్కారుపై  రెచ్చిపోతున్నారు. రిప‌బ్లిక్ ఫంక్ష‌న్‌లో తీవ్ర‌విమ‌ర్శ‌లు గుప్పించిన ప‌వ‌న్‌.. అక్క‌డితో ఆగ‌లేదు. ఆవెంట‌నే కూడా ఆయ‌న సోషల్ మీడియాలో మెసేజ్ లు చేశారు.  జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఎండ‌గ‌ట్టారు.  ఆ త‌ర్వాత‌... న‌వ‌రత్నాలు..-న‌వ‌కష్టాలు.. అని అన్నారు. ఇక‌, తాజాగా మంత్రులు త‌న‌ను విమ‌ర్శించ‌డంపై గ్రామ‌సింహాలు .. అంటూ.. మ‌రోసారి రెచ్చిపోయారు.

ఈ క్ర‌మంలో ప‌వ‌న్ ఇక‌, బీజేపీతో తెగ‌తెంపులు చేసుకుంటున్నార‌ని.. ఆయ‌న దాదాపు మ‌ళ్లీ టీడీపీతో క‌లిసిఅడుగులు వేసేందుకు రెడీ అయ్యార‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌లో కొత్త జోష్ క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచొ జ‌న‌సేన కీల‌క నేత‌లు అంద‌రూ కూడా.. బీజేపీతో తెగ‌తెంపులు చేసుకోవాల‌ని చెబుతున్నారు.

అయితే.. ఈ విష‌యంలో మౌనంగా ఉన్న ప‌వ‌న్‌.. ఇప్పుడు ఆ పార్టీ పెద్ద‌ల‌కు ఇష్టం లేనివిధంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీనిని బ‌ట్టి జ‌న‌సేన నేత‌లు పుంజుకుంటున్నార‌ని.. జోష్ క‌నిపిస్తోంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: