ప్ర‌కాశంజిల్లా చీరాల ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు.. క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తికి ఇంటా బ‌య‌టా కూడా సెగ త‌గులుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న ప్ర‌స్తుతం చీరాల‌లో ఉన్నారు. అయితే.. ఇక్క‌డ వ‌ద్దు.. ప‌రుచూరుకు వెళ్లాల‌ని పార్టీ అధి ష్టానం.. చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యంలో క‌ర‌ణం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. మ‌రోవైపు.. ఆయ‌న వారసుడు.. క‌ర‌ణం వెంక‌టేష్ విష‌యం కూడా ఇలానే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌లు క‌ర‌ణం శిబిరంలో గుబులు రేపుతున్నాయ‌ని అంటున్నారు స్థానిక రాజ‌కీయ నేతలు. ఇప్ప‌టికే ఒక‌వైపు త‌న నియోజ‌క‌వ‌ర్గంపై గుబులుతో ఉన్న క‌ర‌ణానికి ఇప్పుడు వార‌సుడి క‌ష్టం కూడా తోడైంద‌ని చెబుతున్నారు.

దీనికి కార‌ణం.. ప్ర‌స్తుతం క‌ర‌ణం వెంక‌టేష్ అద్దంకి వైసీపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. వాళ్లు చీరాల‌లో ఉన్నా చాలా కార్య‌క్ర‌మాల‌కు స్థానిక కేడ‌ర్ లో ఎక్కువ మంది రాక‌పోవ‌డంతో అద్దంకి నుంచే త‌మ వ‌ర్గం నేత‌ల‌ను దింపుతున్నారు. అయితే.. దీనిపై వైసీపీ అధిష్టానం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. పైగా ఇస్తామ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు హామీ కూడా ఇవ్వ‌లేదు. మ‌రోవైపు. ఇక్క‌డ నుంచి సీనియ‌ర్ నాయ‌కుడు.. వివాద‌ర‌హితుడు... బాచిన చెంచుగ‌ర‌ట‌య్య కుమారుడు.. కృష్ణ‌చైత‌న్య కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే.. ఈయ‌న‌కు కూడా పార్టీ అధిష్టానం టికెట్‌పై ఎలాంటి హామీ ఇవ్వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ. ఇద్ద‌రూ కూడా పోటా పోటీగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. వీరిలో వెంక‌టేష్ దూకుడుగా ఉంటే.. కృష్ణ‌చైత‌న్య సీనియ‌ర్ల‌ను క‌లుపుకొని ముందుకు సాగుతున్నారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రి స‌ల‌హాల‌ను కూడా స్వీక‌రిస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా.. నిదాన‌మే ప్ర‌ధానం అన్న‌ట్టుగా.. ఏ కార్య‌క్ర‌మం చేసినా.. పెద్ద‌ల‌కు చెప్పి చేస్తున్నారు. దీంతో కృష్ణ చైత‌న్య‌పై పెద్ద‌ల్లో ఒక ఫీల్ గుడ్ అనే టాక్ వినిపిస్తోంది. నిదాన‌స్తుడు.. పెద్ద‌ల మాట‌కు గౌర‌వం ఇస్తాడు.. ఆయ‌నైతే.. బెట‌ర్ అని చాలా మంది నోటి నుంచి వినిపిస్తోంది. ఇక‌, క‌ర‌ణం వెంక‌టేష్ ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అయితే.. ఈయ‌న‌పై విమ‌ర్శ‌లు లేవు కానీ.. చీరాల ఎమ్మెల్యేగా ఉన్న త‌న తండ్రి క‌ర‌ణం.. బ‌ల‌రాం చెప్పిన‌ట్టు న‌డుస్తున్నార‌ని.. గ‌తంలో ఆయ‌నతో అనేక ఇబ్బందులు ప‌డ్డామ‌ని.. ఎక్కువ మంది నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అంటే..తండ్రి ఎఫెక్ట్ కుమారుడిపై ప‌డుతోంద‌న్న‌మాట‌. అంతేకాదు.. త‌ర‌చుగా.. అధికారుల‌ను మార్చాలంటూ.. మంత్రి బాలినేని వ‌ద్ద‌కు వెళ్ల‌డం.. ఆయ‌న తిర‌స్క‌రించ‌డం కూడా జ‌రుగుతోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు.. ఈ ఇద్ద‌రు యువ‌నేతల విష‌యంలో అధిష్టానం స‌ర్వే చేయించి.. ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌ని.. నిర్ణ‌యిస్తే.. మాత్రం ఖ‌చ్చితంగా బాచిన‌కే టికెట్ ద‌క్కుతుంద‌ని అంటున్నారు. అంటే.. చివ‌రి నిముషంలో క‌ర‌ణంకు హ్యాండిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే ఇప్పుడు క‌ర‌ణం వ‌ర్గంలో గుబులు రేపుతోంది. ఒక‌వైపు చీరాల,మ‌రోవైపు అద్దంకి.. కూడా వారికి డౌట్‌గానే ఉంద‌ట‌. చివ‌ర‌కు వారికి ప‌రుచూరు మాత్ర‌మే ఆప్ష‌న్‌గా ఉంద‌న్న వార్త‌ల‌తో వాళ్ల‌లో కొత్త గుబులు రేగుతోందంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: