ఈ మధ్య కాలంలో మనం ఆత్మహత్య ఘటనలు వింతగా చూస్తున్నాము. లైవ్ వీడియో లు పెట్టి ఆత్మహత్యలు చేసుకోవడం సంచలనం అయింది. వ్యక్తిగత కుటుంబ ఘటనలు ఆత్మహత్యలకు కారణం అవుతున్న సంగతి విదితమే. లైవ్ పెట్టి ఉరి వేసుకుంటున్న ఘటనలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. సరదాగా వచ్చే ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి ఆత్మహత్యలు చేసుకోవడం కంగారు పెడుతున్న అంశం. మదనపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, మరదలు, అత్త వేధిస్తున్నారని ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ భాస్కర్.

గుంటూరు కు చెందిన‌ ఉదయ్ భాస్కర్ అనే యువకుడు మదనపల్లెలో నివాసమున్నాడు అని పోలీసులు వివరించారు. అతడికి మదనపల్లె కు చెందిన సోనితో ఆరేళ్ల క్రితం వివాహమైంది అని వివరించారు.  వీరిద్దరికీ ఒక కుమార్తె ఉంది అని పోలీసులు పేర్కొన్నారు. మదనపల్లెలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మేనేజర్ గా పని చేస్తున్న ఉదయభాస్కర్...  కుటుంబ కలహాలతో తరుచుగా గొడవ పడేవాడు అని పోలీసులు మీడియాకు తెలిపారు. నిన్నటి ఉదయం పది గంటలకు ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసిన ఉదయ భాస్కర్ మాట్లాడుతూ...


వేధిస్తున్నారని చెబుతూ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి వేసుకుని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు పేర్కొన్నారు. ఫేస్ బుక్ లో ఇది గమనించి స్నేహితులు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారని దీనితో తాము అక్కడికి వెళ్లామని పోలీసులు వివరించారు. తలుపు  తీయగానే ఉదయ్ భాస్కర్ మృతి చెంది కనిపించాడు అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం... వన్ టౌన్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని మీడియాకు వివరించారు. కాగా తన‌ భర్త ఉదయ్ భాస్కర్ రోజూ తాగి వచ్చి తమను కొడుతున్నాడని  అతని భార్య సునీత గతంలో పోలీసులకు పిర్యాదు చేసినట్లు స్థానికులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: