అమెరికన్ సింగర్ ఆర్.కెల్లీ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. తన పాపులారిటీని ఉపయోగించుకొని పలువురు మహిళలతో పాటు చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తొమ్మిది మంది మహిళలతో పాటు ఇద్దరు పురుషులు కెల్లీ చేతిలో లైంగిక వేధింపులు గురయ్యారు. లైంగిక వేధింపుల కేసులో ఆరు వారాల పాటు విచారణను ఎదుర్కొన్నాడు కెల్లీ. ఆ నేరాలకు పాల్పడినట్టు దోషిగా తేలాడు. మే 4న నిందితునికి శిక్ష పడుతుండగా.. జీవితాంతం కటకటాల వెనక్కి వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని అమెరికా అటార్నీ ఆఫీస్ వెల్లడించింది.  

న్యూయార్క్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ విచ్చలవిడిగా జరుగుతుంది. ఇందులో ప్రధాన నిందితుడిగా కెల్లీ ఉన్నాడు. అంతేకాదు మహిళల అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కెల్లీపై మొత్తం 14కేసులుండగా.. ఈ కేసులన్నిటిలో దోషిగా తేలాడు. గత 20 సంవత్సరాల నుండి ఇతడు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఒక్క లైంగిక దోపిడీ కేసు మాత్రమే కాదు.. కిడ్నాప్, లంచం కేసుల్లో కూడా ఇతనిపై అభియోగాలున్నాయి. ఏ నేరాన్ని ఇతడు చేసినట్టు ఒప్పుకోక పోగా.. రుజువులు కెల్లీని  దోషిగా తేల్చాయి. ఆరుగురు సాక్షుల ద్వారా ఇతని బండారం బట్ట బయలైంది. కెల్లీ జైలులో ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు లిఖిత పూర్వకంగా తెలిపింది. బహిరంగంగా ఆమె ఎవరో తెలియకపోయినా.. జరుగుతున్న విచారణలో తాను ఎదుర్కొన్న వేధింపులను వివరించింది. కెల్లీ నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి దాక్కున్నట్టు చెప్పుకొచ్చింది.  

1996లో వచ్చిన ఐ బిలీవ్ ఐ కెన్ ఫ్లై అనే పాట ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు కెల్లీ. ఇతని పూర్తి పేరు రాబర్ట్ సిల్వెస్టర్ కెల్లీ. ఇతని నేర సామ్రాజ్య విస్తరణలో ఎవరు ఎలా సహాయ పడతారో ప్రాసిక్యూటర్లు పూసకు గుచ్చినట్టు వివరించారు.







.


మరింత సమాచారం తెలుసుకోండి: