ఈ మధ్య కాలంలో విజయవాడ లో జరుగుతున్న ఘటనలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా విజయవాడలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు లో వివాహిత భర్త ముందు ఊరి వేసుకుని ఆత్మహత్య ఘటన మరువక ముందే... విజయవాడ లో మరో ఘటన సంచలనం అయింది. గత సంవత్సరం అక్టోబర్ లో అంజన్ కృష్ణ, రేణుకాకు వివాహం జరిగింది. పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం అంజన్ కృష్ణతో రేణుక వివాహం ఘనంగా చేసారు కుటుంబ సభ్యులు.

రెండు నెలల సక్రమంగా కాపురం చేసిన భర్త అంజన్ కృష్ణ... ఆ తర్వాతి నుంచి భార్యను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అంజన్ కృష్ణ మరో మహిళల తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తో మందలించిన భార్య రేణుక... ఇలా ఉంటె కష్టం అని చెప్పారని తెలిసింది. మరో మహిళల తో వివాహేతర సంబంధం బయట పటడంతో తమ కుమార్తె ను అల్లుడు చిత్రహింసలకు గురి చేసేవాడని కుటుంబ సభ్యులు  పోలీసులకు తెలిపారు. భార్య పై కోపంతో ప్రతి రోజు వేధింపులకు గురి చేసేవాడని మృతిరాలి రేణుక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు పోలీసుల ముందు.

భార్యను అనేక మార్లు చనిపోవాలని తిట్టే వాడని... చివరకు చనిపోయేట్లు చేశాడని అల్లుడు పై  ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. తమ బిడ్డ మరణానికి కారణమైన భర్త అంజన్ కృష్ణ ను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భర్త అంజన్ కృష్ణ పరార్ లో ఉన్నాడని అంటున్నారు. రేణుక మృతికి కారణమైన అంజన్ కృష్ణను పోలీసులు పట్టుకుని వెంటనే శిక్ష పడే విధంగా చూడాలి అని కోరుతున్నారు. భర్త అంజన్ కృష్ణ కోసం గాలిస్తున్న పోలీసులు... త్వరలోనే పట్టుకుంటాం అని చెప్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap