ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందో అని... భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని గుబులు రేపుతోంది. ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ... అవినీతి పాల్పడిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ.రమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతో మందిని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కొంతమంది అధికారులు సీబీఐ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కూడా. ఇలాంటి వారికే ఇప్పుడు సీజేఐ చేసిన వ్యాఖ్యలు గుబులు రేపుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ఐపీఎస్ అధికారి కేసు విచారణ సమయంలో సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారికి రక్షణ ఎందుకు కల్పించాలని జస్టిస్ ఎన్‌వీ.రమణ సూటిగా ప్రశ్నించారు. తప్పకుండా జైలుకు వెళ్లి శిక్ష అనుభవించాల్సిందే అని వార్నింగ్ కూడా ఇచ్చారు సీజేఐ జస్టిస్ ఎన్‌వి.రమణ ఈ కామెంట్స్ ఇప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

అక్రమాస్తుల కేసులో తనను అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించాలంటూ ఐపీఎస్ అధికారి గుర్ణీందర్ పాల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్‌వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం... ప్రజా ధనం దోచుకున్న వారికి రక్షణ ఎందుకివ్వాలని ప్రశ్నించింది. గత ప్రభుత్వాలతో సన్నిహితంగా మెలిగి అక్రమార్జనకు పాల్పడిన అధికారులు ఎట్టి పరిస్థితుల్లో జైలుకు వెళ్లాల్సిందే అని కామెంట్ చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ప్రభుత్వంతో కుమ్మకైన పోలీసు ఉన్నతాధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై లేదన్నారు. అక్రమాస్తులు సంపాదిస్తే జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు సీజేఐ. తప్పు చేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సీజేఐ చేసిన వ్యాఖ్యలు పలువురు అధికారులను కలవరపెడుతున్నాయి ఇప్పుడు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలక శాఖల్లో పని చేసిన పలువురు అధికారులు ఇప్పుడు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్నారు. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇప్పటికే జైలుకు వెళ్లి.. బెయిల్ పై బయటకు వచ్చారు. అలాగే చంద్రబాబు సర్కార్‌లో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి ఐబీ వెంకటేశ్వరరావు కూడా ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. మరో ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కూడా ప్రస్తుతం సీబీఐ కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. వీరంతా ఇప్పుడు సీజేఐ వ్యాఖ్యలతో కలవరపడుతున్నారు. ఇక ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించి... ప్రజాధనం దుర్వినియోగం చేసేలా వ్యవహరించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: