ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దళితుల విషయంలో కాస్త ఎక్కువ కేర్ తీసుకోవడం మనం గమనిస్తున్నాం. దళితులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కూడా కేటాయిస్తూ వస్తున్నది. దళితులకు గత ప్రభుత్వం లో కంటే ఎక్కువగా నిధులు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేయడం చూస్తున్నాం. విద్యా శాఖా విషయంలో దళితులకు అన్యాయం లేకుండా సిఎం వైఎస్ జగన్ జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నారు. తాజాగా గుర్రం జాషువా జయంతి సందర్భంగా గుంటూరు నగరంపాలెం సెంటర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్థఫా, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు డొక్కా, లక్ష్మణరావు పలువురు హాజరు అయ్యారు. జాషువా తెలియని తెలుగు వారెవరుండరు అని అన్నారు మంత్రి. ఆయన దళిత సాహిత్యానికి ఎంతో సేవ చేశారు అని కొనియాడారు. సమాజంలోని అసమానతలు, రుగ్మతలు తొలగించడానికి రచనలు చేశారు అని ఆయన పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతూ కూడా తెలుగు సబ్జెక్ట్ ను తప్పని సరి చేశాం అని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేసారు. తెలుగు భాషాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు ఆయన.

దళిత, బడుగు,బలహీన వర్గాలకు విద్య అందుబాటులో ఉండాలి అని విజ్ఞప్తి చేసారు. గత ప్రభుత్వాలు విద్యను ప్రవేటు పరం చేసి బడుగులకు విద్యను దూరం చేశాయి అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నాం అని మంత్రి వివరించారు. ప్రవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు బడుగు, బలహీన విద్యార్థులు కేటాయించాలని సిఎం ఆదేశించారు అని ఆయన పేర్కొన్నారు. మంత్రి వర్గం విషయం లో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటాం అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp