నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) సూపర్ స్పెషాలిటీ ఎగ్జామినేషన్ 2021 సిలబస్‌ లో చివరి నిమిషంలో మార్పులు చేయడంపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం పవర్ గేమ్‌ లో యువ వైద్యులను ఫుట్‌బాల్‌ గా భావించడం తప్పు అని సుప్రీం కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిలబస్‌ లో చివరి నిమిషంలో మార్పులతో విద్యార్ధులు సంతృప్తి చెందకపోతే... ప్రభుత్వం ప్రతిపాదించిన సూచనలను ఆమోదించకపోవచ్చని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. యువ వైద్యులు బ్యూరోక్రాట్ల చేతిలో ఉండటాన్ని మేము అనుమతించేది లేదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నేషనల్ మెడికల్ కమిషన్, మరియు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్  లను ముందు పటిష్టం చేయాలని సుప్రీం కోర్ట్ సూచించింది. దీనిపై తమ అనుమానాలను నివృత్తి చేయడానికి ఇద్దరు అధికారులను నియమించాలని సుప్రీం కోర్ట్ సూచించింది.

తాము సంతృప్తి చెందలేదు అంటే మాత్రం కచ్చితంగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని సుప్రీం కోర్ట్ పేర్కొంది. యువ వైద్యులను పవర్ గేమ్‌లో ఫుట్‌బాల్స్‌ గా  పరిగణించవద్దు అని సుప్రీం కోర్ట్ తెలిపింది. యువ వైద్యుల జీవితాలను కొంతమంది సున్నితమైన బ్యూరోక్రాట్ల చేతిలో ఉంచడాన్ని తాము అంగీకరించే పరిస్థితి లేదని అని స్పష్టం చేసారు. పరీక్ష కోసం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత సిలబస్‌లో చివరి నిమిషంలో చేసిన మార్పులను సవాల్ చేస్తూ 41 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూలై 23 న పరీక్ష కోసం నోటిఫికేషన్ జారీ చేసారు మరియు ఆగస్టు 31 న సిలబస్‌ను మార్చారు ఇది ఏంటీ అంటూ సుప్రీం కోర్ట్ ప్రశ్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: