ఇటీవల ఆధ్యాత్మిక కేంద్రాలపై వస్తున్న అనేక విమర్శలకు చెక్ పెట్టేందుకు ఏపీలో ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి బ్రాహ్మణ సంక్షేమాన్ని తీసుకురావడంపై మాజీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మెన్ వేమూరి ఆనంద సూర్య తప్పుబట్టారు. ఈ చర్యతోనే ప్రభుత్వం బ్రాహ్మణులపట్ల ఉన్న ప్రేమ తెలిసిపోతుందని ఆయన అన్నారు. ఇది రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించడానికే తెచ్చారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కోసం ప్రతియేటా 1000కోట్లు కేటాయిస్తామని, ప్రతి జిల్లాలో బ్రాహ్మణ భవనాలు నిర్మించి ఇస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగా పరిస్థితులు ఏమి కనిపించడం లేదని ఆయన అన్నారు.

ఈ తరహా జీవో లు తేవడం వలన రాష్ట్రంలో ఆందోళనలు లేవనేత్తే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. అఖిలభారత బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షుడు ద్రోణం రాజు రవికుమార్ మాట్లాడుతూ, జగన్ బ్రాహ్మణ సంక్షేమం కోసం నిజంగా కృషి చేయాలి అనుకుంటే ప్రత్యేక బలహీన వర్గాల సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి దానిలో బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ను కలిపితే బాగుండేదని అన్నారు. రాష్ట్రంలో ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ ఈ జీవో గత ప్రభుత్వం కూడా తీసుకువచ్చింది. దానిపై అప్పట్లో బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పటి సీఎం నాయుడు తిరిగి బ్రాహ్మణ సంక్షేమాన్ని రెవెన్యూ కిందకి తెచ్చారు.

రెవిన్యూ లో బ్రాహ్మణ సంక్షేమ శాఖ ఉండటంపై నిధుల దారిమల్లింపు అనే విమర్శ రావటంతో దానిపై ఇప్పటికి కోర్టులలో విచారణ జరుగుతుందని వారు చెప్పారు.  విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పునరాలోచించాలని కోరతామని అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికోసం ప్రత్యేక సంక్షేమ శాఖను తీసుకువచ్చి దానిలో అన్ని అగ్రవర్ణాల లో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వారిని చేర్చాలని సూచిస్తామన్నారు. కోన రఘుపతి మాట్లాడుతూ, ప్రస్తుత జీవో కేవలం నిధుల సమీకరణ ద్వారా బ్రాహ్మణ సంక్షేమానికి మేలుచేయడానికే తప్ప మరో ఉద్దేశ్యం లేదనేది అందరు గ్రహించాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp