మ‌ళ్లీ రాష్ట్రంలో ఉప ఎన్నిక కోలాహ‌లం ప్రారంభం కానుంది. వ‌చ్చేనెల 1న క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఉప ఎన్ని కకు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఇక‌, ఇప్ప‌టికే ఎన్నిక‌ల కోడ్‌ను అమ‌లు చేస్తున్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అయితే.. ఈ ఉప ఎన్నిక‌లో మ‌రోసారి.. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ భారీ పోరు దిశ‌గా అడుగులు వేయ‌నున్నాయి. వాస్త‌వానికి వైసీపీకి కంచుకోట అయిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీ పీ గెలిచే ప‌రిస్థితి లేదు. 1985, 1994, 1999 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. అది కూడా బిజివేముల వీరారెడ్డి విజ‌యం సాధించారు.

ఆ త‌ర్వాత‌.. పార్టీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్న ప‌రిస్థితి లేదు. అయితే.. కేడ‌ర్ ఉంది. ఓటు బ్యాంకు కూడా ఉంది. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ దూకుడు.. ముందు టీడీపీ గెలుపు గుర్రంఎక్కే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజ‌శేఖ‌ర్‌నే ఈ ద‌ఫా కూడా పోటీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే.. ఇక్క‌డ కూడా తిరుప‌తి ఫార్ములాతోనే.. టీడీపీ ముందుకు సాగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల జ‌రిగిన‌న తిర‌ప‌తి ఉప ఎన్నిక‌లోనూ.. తాము ఓడిపోతామ‌ని తెలిసినా.. వైసీపీకి మెజారిటీ త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా ఇక్క‌డ ప‌నిచేశారు.

సాక్షాత్తూ.. టీడీపీ అదినేత చంద్ర‌బాబు.. రంగంలోకి దిగి.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప పోరులో ప్ర‌చారం చేశారు. అయితే.. ఇప్పుడు బ‌ద్వేల్ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. అసెంబ్లీకే ప‌రిమితం కావడం వంటి నేప‌థ్యంలో చంద్ర‌బాబు నేరుగా రంగంలోకి దిగుతారా?  లేదా.. త‌న కుమారుడు... మాజీ మంత్రి లోకేష్ సార‌థ్యంలోనే ఉప పోరుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతారా? అనేది చూడాల్సి ఉంది. ఇక ఎస్సీ నాయ‌కులు, మాజీ మంత్రులు.. కూడా రంగంలోకి దిగి ప్ర‌చారం చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వైసీపీ అభ్య‌ర్థి మెజారిటీ  త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌లు చూస్తే.. 2014లో టీడీపీకి 68800 ఓట్లు రాగా, గ‌త 2019 ఎన్నిక‌ల్లో 50.748 ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. సో.. దీనిని బ‌ట్టి.. అధికారంలో ఉన్న ఐదేళ్ల‌లోనూ పార్టీని ఇక్క‌డ డెవ‌ల‌ప్ చేసుకోలేక పోయార‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ఓట్లు బాగా త‌గ్గాయి. మ‌రి ఇప్పుడు వైసీపీకి మెజారిటీని త‌గ్గించేందుకు .. ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి. లేక‌.. గెలుపు గుర్రం ఎక్కేలావ్యూహం కూడా రెడీ చేసుకుంటారా.. అనేది ఆస‌క్తిగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: