భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రోజుకు 18 గంట‌లు ప‌ని చేస్తాడు. నాలుగు గంట‌లే నిద్ర పోతాడు అని బీజేపీ నాయ‌కుల త‌ర‌చూ చెబుతుంటారు. ఎప్పుడు చూసిన ఏదోటి చేస్తుంటారు అనే ప్ర‌చారం సాగుంది. మొన్న‌టికి మొన్న అగ్ర రాజ్యం అమెరికా  ప‌ర్య‌ట‌నకు వెళ్తున్న సంద‌ర్భంలో  విమానంలో ఏదో ఫైల్స్ ముందేసుకుని సీరియ‌స్‌గా ఏదో చ‌దువుతున్న ఫోటో వైర‌ల్ అయింది. దీనిపై బీజేపీ నాయ‌కులు మోడీ అంటే ఎప్పుడు ప‌ని చేసే నాయ‌కుడ‌ని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.


   అయితే, గ‌తంలో భార‌త ప్ర‌ధానిగా ప‌ని చేసిన వీపి.సింగ్‌, మ‌న్మోహ‌న్ సింగ్, దేవే గౌడ్ ల‌తో పోల్చిన‌ప్పుడు. మోడీ గుర్తుకు వ‌స్తారు. న‌రేంద్ర మోడీకి అస‌లు వ్య‌క్తి గ‌త జీవితం విష‌యాన్ని ప‌ట్టించుకోడ‌ని క‌మల ద‌ళ నాయ‌కులు చెబుతుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే న‌రేంద్ర మోడీ నిబ‌ద్ధ‌త మ‌న‌కు క‌నిపిస్తూనే ఉంటుంది. మొన్న‌టికి మొన్న నాలుగురోజుల పాటు అమెరికా ప‌ర్య‌ట‌న‌లో మోడీ ఉన్నారు. ఇందులో 20కి పైగా స‌మావేశాలు, భేటీలు నిర్వ‌హించారు. ఇలా విరామం లేకుండా అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చారు.


   సాధార‌ణంగా మ‌నం ఏ ఊరికి అయిన వెళ్లి వ‌స్తే దాదాపు మూడు నాలుగు గంట‌లు రెస్ట్ తీసుకుంటాం. కానీ, మోడీ 60 గంట‌ల పాటు విదేశం అయిన అమెరికాకు విమానంలో ప్ర‌యాణం చేసి తిరిగి భార‌త్‌కు వ‌చ్చారు. వ‌చ్చిన త‌రువాత ఎలాంటి విరామం తీసుకోకుండా త‌న ప‌నుల్లో మునిగిపోయాడు. ర‌క్ష‌ణ శాఖా మంత్రి తో రివ్యూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అలాగే, సెంట్ర‌ల్ విస్టా నిర్మాణ ప‌నుల‌ను సంద‌ర్శించాడు.  ఎప్ప‌టిలాగే త‌న ప‌నిలో కంటిన్యూగా నిమ‌గ్నం అయ్యారు.ఏడున్న‌రేళ్ల‌లో ఎలాంటి విరామం తీసుకోకుండా ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసమే ప‌ని చేస్తున్నార‌ని బీజేపీ వాళ్లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఉన్న రాహుల్ గాంధీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ విదేశాలకు వెళ్లార‌ని, త‌న వ్య‌క్తిగ‌త స‌ర‌దాల‌ను ఎప్పుడూ వ‌దులుకోలేడ‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.మరింత సమాచారం తెలుసుకోండి: