లోన్ యాప్స్ పేరుతో ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేసాయి చైనా యాప్స్. క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడిన కొందరు యువకులు ఎక్కువగా ఈ యాప్స్ లో లోన్ తీసుకునే ప్రయత్నం చేసారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థలు సీరియస్ గా దృష్టి సారించాయి. ఇక విచారణలో భాగంగా చైనా యప్స్ స్కాం  లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలని చైనాకు తరలించింది ముఠా. లోన్  ఆప్స్ పేరుతో 5 వేల కోట్ల రూపాయలను చైనా కు తరలించారు అధికారులు. కొత్త పద్ధతిలో చైనా కి డబ్బులు తరలించింది.

చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నట్లుగా సృష్టిoచిన ముఠా..  విమానాల ద్వారా పెద్దమొత్తంలో వస్తువులు దిగుమతి  చేసుకున్నట్టుగా పత్రాలు సృష్టించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.  పత్రాలను పరిశీలించిన ఈడికి దిమ్మతిరిగే అంశాలు వెలుగులోకి వచ్చాయి.  ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకోకపోయన సరే  డబ్బులు మళ్లింపు జరిగింది అని అధికారులు పేర్కొన్నారు.  వస్తువులు దిగుమతి చేసుకుని  డబ్బులు పంపించినట్టు గా క్రియేట్ చేసిన ముఠా.. చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది.

హైదరాబాద్ సీసీఎస్ లో లోన్ యాప్స్ కు సంబంధించి మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. పలువురు కీలక వ్యక్తుల మీద దృష్టి పెట్టారు. పత్రాల పరిశీలనలో వెలుగులోకి కొత్త కొత్త మోసాలు వస్తున్నాయి. 450 కోట్ల రూపాయల సంబంధించిన వస్తువులను దిగుమతి చేసినట్లుగా నకిలీ ఆధారాలు సృష్టించారు కొందరు. విమానాల ద్వారా వస్తువులను దిగుమతి చేసుకున్నట్లుగా నకిలీ వే బిల్స్ తయారు చేసారు. వే బిల్స్ పరిశీలించగా నకిలీవని తేల్చిన ఈ డి.. వాటి ఆధారంగా విచారణ మొదలుపెట్టింది. తప్పుడు వే బిల్స్ పెట్టి 450 కోట్ల రూపాయల నిధులను చైనాకు తరలించినట్లు ఈడి అధికారుల విచారణలో బయటపడింది. ఈడి ఫిర్యాదు తో సిసిఎస్ లోన్ ఆప్స్ ప్రతినిధుల పై కేసు నమోదు చేసారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: