హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపధ్యంలో ఏ పరిణామాలు ఉంటాయి ఏంటీ అనేది ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తిని రేపుతుంది. రాజకీయపార్టీల్లో ఇప్పుడు వాతావరణం సందడి సందడిగా ఉంది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన టిఆర్ఎస్... హరీష్ రావు కు ఉప ఎన్నికల బాధ్యతను అప్పగించి ధీమాగా ఉంది. గులాబీ పార్టీ ప్రచారం ఇప్పుడు హుజూరాబాద్ లో జోరుగా ఉంది. ఇక ఊరూరా ప్రచారంతో స్పీడ్ పెంచిన ఈటెల.. రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఉంది. అన్ని పార్టీలు దాదాపుగా అభ్యర్ధిని ప్రకటించినా సరే కాంగ్రెస్ ఇంకా ముందుకు వెళ్ళడం లేదు. కొండా సురేఖ అభ్యర్థిత్వం వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ మొగ్గు చూపిస్తున్నారు. స్థానికులకు అవకాశం ఇవ్వాలంటున్న సీనియర్లు జిల్లా నాయకుల మాటలను రేవంత్ పట్టించుకోవడం లేదు. ఇక నేడు హుజూరాబాద్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సిపి సత్యనారాయణ  మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ హుజురాబాద్ ఆర్డీవో ఎన్నికల  రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉంటారు అని ఆయన స్పష్టం చేసారు.

హుజురాబాద్ లో వ్యాక్సినేషన్ జరుగుతోంది అని ఆయన తెలిపారు.  70 శాతం ఫస్ట్ డోస్,  50 శాతం సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి అయిందని పేర్కొన్నారు. వీనవంక,జమ్మికుంట, హుజురాబాద్, కమలాపూర్, ఇళ్లందకుంట వ్యాప్తంగా ఎన్నికల ఆంక్షలుంటాయి అని ఆయన పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ తక్షణమే అమలులోకి వచ్చింది అని స్పష్టం చేసారు. ఎన్నికల్లో పనిచేసే ఉద్యోగులకు పోలింగ్ ఏజెంట్లకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండాలి అని తెలిపారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు సైతం వ్యాక్సిన్ వేపించుకోవాలి అని సూచించారు. సిపి సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయ పార్టీల ర్యాలీలకు సభలకు పర్మిషన్ తీసుకోవాలి అని సూచించారు. మద్యం నగదు పంపిణీలపై పర్యవేక్షణ ఉంటుంది ఉంటుంది అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts