ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో పాలిటిక్స్ హాట్ హాట్ గా ఉన్నాయి. ఏపీలో పొలిటికల్ వార్ తారాస్దాయికి చేరుకుంది. ముఖ్యంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటలు తూటాలు లా పేలుతున్నాయి. గ‌త యేడాది కాలంగా బెజ‌వాడ టీడీపీ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు నుంచే టీడీపీ లో గ్రూపుల గోల తో పార్టీ నేత‌లు ఇబ్బంది ప‌డుతుండ‌డంతో పాటు అధిష్టానం సైతం ఇక్క‌ట్లు ప‌డుతోంది. తాజాగా ఎంపీ కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకోవ‌డం తో రాజకీయం ఒక్క‌సారిగా రాజుకుంది. నాని ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పాటు ఈ విష‌యాన్ని నేరుగా చంద్ర‌బాబుకే చెప్పేశారంటూ ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

ఈ ప్ర‌చారం రెండు రోజులుగా ఊపందు కోవ‌డంతో ప‌లువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో పాటు కేశినేని నాని అభిమానులు వ‌రుస‌గా కేశినేని భవనుకు చేరుకుంటున్నారు. ఈ రోజు కేశినేని భ‌వ‌న్ సంద‌డిగా ఉంది. బెజవాడలోని మూడు నియోజకవర్గాలు సహా ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు భారీగా కేశినేని భవనుకు చేరుకుంటున్నారు. 2024లో కూడా ఎంపీగా పోటీ చేయాలని కేశినేని నానిపై కార్య‌క‌ర్త‌లు ఒత్తిడి పెడుతోన్న ప‌రిస్థితి ఉంది.

నాయ‌కుల ఒత్తిడితో మౌనంగా ఉన్న నాని మాట్లాడారు. బెజవాడలో దుర్గమ్మ ఉన్నంత వరకు.. కేశినేని భవన్ ఉంటుంద‌ని చెప్పారు. బెజ‌వాడ పార్ల‌మెంటు ప‌రిధిలో భ‌యంక‌ర‌మైన జ‌గ‌న్ వేవ్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోతే నాని ఎంపీగా గెలిచార‌ని.. ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌త ఇమేజ్ లేక‌పోతే ఆయ‌న రెండో సారి ఎలా ఎంపీగా గెలుస్తార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. అలాంటి నేత‌ను ప‌క్క‌న పెట్ట‌డం.. ప్ర‌యార్టీ లేకుండా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని సూచిస్తున్నారు.

మ‌రోవైపు తాను ఎంపీగా ఉన్నా కూడా బుద్ధా వెంక‌న్న‌, బొండా ఉమా లాంటి నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం వ‌ల్లే నాని మ‌న‌స్థాపంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి అధిష్టానం నానిని వ‌దిలేస్తుందా ?  బుజ్జ‌గిస్తుందా ? అన్న‌ది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: