తాజాగా ఏపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వాజ్యం దాఖ‌ల‌యింది. ఇందులో అర్చ‌కులకు ఇచ్చే జీతం దేవాల‌యాల ద్వారా వ‌చ్చిన ఆదాయం నుంచి ఇస్తున్నార‌ని, ఇదే క్ర‌మంలో పాస్ట‌ర్ల‌కు, ఇమామ్‌ల‌కు ప్ర‌భుత్వ నిధుల నుంచి జీతాలు చెల్లించ‌డం లౌకిక వాదామా అని ప్ర‌శ్నిస్తూ.. ఇది రాజ్యాంగ వ్య‌తిరేకం అంటూ ఏపీ ప్ర‌భుత్వంపై హైకోర్టులో వాజ్యం దాఖ‌ల‌యింది. నిజానికి, గ‌తంలో వ‌క్ఫ్ బోర్డు ద్వారా వ‌చ్చిన ఆదాయం ద్వారా ఇమామ్‌ల‌కు జీతాలు చెల్లించేవారు. అలాగే దేవాల‌యాల ఆస్తులు, భ‌క్తుల ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని అర్చ‌కులకు ఇస్తున్నారు.


ఈ క్ర‌మంలో పాస్ట‌ర్ల‌కు రూ.5000 జీతం చొప్పున ప్ర‌క‌టించ‌డంతో  ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది.
 అయితే, ఇప్పుడు జ‌నాభా ప్ర‌తిప‌ద‌క‌న చూస్తే జ‌న‌భా లెక్క‌ల ఆధారంగా 1971లో ఆంధ్ర ప్ర‌దేశ్‌లో 15 ల‌క్ష‌ల మంది అంటే రెండు శాతం జ‌నాభా క్రైస్త‌వులు ఉన్నారు. ఇప్పుడు 2011 జ‌నాభా లెక్క‌ల ఆధారంగా క్రైస్త‌వుల జ‌నాభా 1.39 శాతానికి త‌గ్గిపోయింద‌ట‌. అయితే, వివిధ ర‌కాలు ఉన్న బాపిస్ట్ చ‌ర్చి, సౌత్ ఇండియా చ‌ర్చి ఇలా ప‌లుర‌కాల చ‌ర్చిల లెక్క‌ల ఆధారంగా దాదాపు 78 ల‌క్ష‌ల మంది ఉన్నార‌న్నది తెలుస్తోంది.



ఈ లెక్క‌లు అంతా చ‌ర్చిల త‌ర‌ఫున చెబుతున క్రైస్త‌వ జ‌నాభా లెక్క‌లు.  అయితే, అధికారికంగా ఉన్న జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం 1.39 శాతం అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌నాభా ఆధారంగా అర్చ‌కుల‌కు డ‌బ్బులు ఇస్తుంది కేవ‌లం 31 వేల మందికేన‌ని కానీ, రాష్ట్ర జ‌నాభాలో హందువులు 90 శాతానికి పైగా ఉంటే  ఇంతే మందికి ఎలా ఇస్తార‌ని బీజేపీ నేత‌లు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు.


 అలాగే, క్రైస్త‌వులు 1.39 శాతం మంది క్రైస్త‌వుల‌ను జ‌నాభా లెక్క‌ల్లో చూపిస్తూ 29 వేలకు పైగా పాస్ట‌ర్ల‌కు జీతాలు ఎలా ఇస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు బీజేపీ నాయ‌కులు. అయితే, త‌మ రిజ‌ర్వేష‌న్ల‌ను కోల్పోతామ‌ని చాలా మంది త‌మ సామాజిక వ‌ర్గంలోనే కొన‌సాగుతూ క్రిస్టియానిటి ఫాలో అవుతున్నారు, అలాగే, రికార్డుల ప‌రంగా కాకుండా 2011 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విప‌రీతంగా జ‌నాభా పెరిగే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: