ఈసిఐ హుజురాబాద్ ఉప ఎన్నికలకి షెడ్యూల్ ఇచ్చారు అని అన్నారు తెలంగాణా ఎన్నికల కమీషనర్ శశాంక్ గోయల్. అక్టోబర్ 30 న ఎన్నికలు ఉంటాయి అని నవంబర్ 2 ఫలితాలు ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ ఇంకా ఉంది కాబట్టి కోవిడ్ నిబంధనలు ఏవిధంగా తీసుకోవాలని అనేదానిపై సూచనలు చేశారు అని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ సంబంధించి ఎలాంటి ర్యాలీ లకు అనుమతి లేదు అని తెలిపారు. మూడు వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నిబంధనలు పాటించాలి అని సూచించారు. స్టార్ కంపైనర్ లిస్ట్ కూడా కుదించారు అని ఆయన అన్నారు. నో రోడ్ షో లు, మోటార్ ర్యాలీలకు అనుమతి లేదు అని అన్నారు. ఇంటింటికీ ప్రచారంలో లోకూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి అని స్పష్టం చేసారు. పోలింగ్ కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలన్నారు ఆయన. వెహికిల్ లో కూడా పార్టీ ల నేతలు కోవిడ్ నిబంధనలు పాటించాలి అని తెలిపారు. కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశాం అని ప్రతి ఒక్కరు కేంద్ర ఎన్నికల నిబంధనలు పాటించాలి అని స్పష్టం చేసారు.

అధికారులకు కూడా సూచిస్తున్న కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి అన్నారు. ఇవాల్టి నుండి మెడల్ కోడ్ ఉంటుంది అని హుజురాబాద్ రెండు జిల్లాలో ఉంటుంది అని పేర్కొన్నారు. ఆ రెండు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు లో ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలు పరిశీలించాం ఇప్పటికే అని తెలిపిన ఆయన... 305 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అని అన్నారు. 47 పోలింగ్ కేంద్రాల్లో 1000 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు అని పేర్కొన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తాం అన్నారు. 236430 ఓటర్లు ఉన్నారు అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts