టిఆర్ఎస్ పార్టీ మరియు సిఎం కెసిఆర్ పై నివప్పులు చెరిగారు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు బండి సంజయ్.  ప్రజల ఆవేశం ఆలోచన సంగ్రామ యాత్ర అని పేర్కొన్నారు.  రైతుబంధు మాత్రమే ఇచ్చి మిగతా అన్ని పథకాలను తెలంగాణ రాష్ట్ర  సీఎం కెసిఆర్ వదిలేశాడని నిప్పులు చెరిగారు బండి సంజయ్. సిఎం కెసిఆర్ రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు బండి సంజయ్. 

రైతులకు భరోసా కల్పించని సీఎం.. వరి వేస్తే వురే అంటున్నాడని ఫైర్ అయ్యారు.  దుబ్బాక నియోజక వర్గ ఉప ఎన్నిక ల్లో దొడ్డు వడ్లు వద్దు అన్న వాళ్లు వేయమన్నాడు.. కేంద్రం తో సంబంధం లేకుండా ప్రతి గింజ నేనే కొంటా అన్నాడని గుర్తు చేశారు బండి సంజయ్. ఇప్పుడేమో వరి వేస్తే ఉరి అంటూ కేంద్రం మీద నెపం నెట్టేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొన బోమని ఎవరు చెప్పారో సీఎం కెసిఆర్ చెప్పాలని నిలదీశారు. అగ్గిపెట్టె మంత్రి హరీష్ రావు కు అగ్గి పెట్టె ఎందుకు దొరక లేదో చెప్పాలని...పేర్కొన్నారు.

సిఎం  కెసిఆర్ ఓ బ్రోకర్ అని... ఢిల్లీ కి టైం పాస్ కోసం వెళుతున్నాడు కేసీఆర్ అని మండిపడ్డారు. సంగ్రామ యాత్ర విజయవంతం అవుతున్నదని...  టీఆర్ఎస్ గల్లంతు ఖాయం అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ మంత్రులు సగం మంది నక్సలైట్లు, నక్సలైట్ల  సాను భూతి పరులే అని పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కోసం ప్రయత్నం చేస్తుందన్నారు. అభ్యర్థి లేని పార్టీ కాంగ్రెస్ అని... కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లో లేదు గల్లీ లో లేదని స్పష్టం చేశారు బండి సంజయ్.   ఇతర పార్టీలు ఎన్నిక ల్లో అన్ని పార్టీల తో పొత్తు పెట్టుకున్నాయని... బిజెపి పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు బండి సంజయ్.

   

మరింత సమాచారం తెలుసుకోండి: