చైనా మరోసారి కుతంత్రానికి పాల్పడుతోంది. ఎన్నిసార్లు తరిమి కొట్టినా కూడా డ్రాగన్ కట్రీకి  బుద్ది రావడం లేదు. తూర్పు లడఖ్‌లో మొదలైన సరిహద్దు ఘర్షణ... అలాగే కొనసాగుతోంది. డ్రాగన్ దేశం మరోసారి తన దొంగ బుద్ధిని చూపుతోంది. పైకి చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటిస్తూనే... బోర్డర్‌లో మాత్రం దుస్సాహసానికి పాల్పడుతోంది. చర్చల సమయంలో భారత్‌లో కాలు పెట్టేది లేదని ప్రకటించిన చైనా... మన దేశంలోకి తమ సైన్యాన్ని మరోసారి చొరబడేలా ప్లాన్ చేసింది. కాశ్మీర్‌లోని లఢఖ్‌లో వెనక్కి తరిమికొట్టడంతో... ఇప్పుడు తమ చొరబాటు ప్రాంతాన్ని మార్చేసింది చైనా. ఈసారి ఉత్తరాఖండ్‌లోని బర్హోతీలో ఉన్న ఇండో-చైనా బోర్డర్ ద్వారా ఏకంగా వంద దళాల చైనా లిబరేషన్ ఆర్మీ బలగాలు భారత్‌లో చొరబడినట్లు తెలుస్తోంది. గత నెల 30వ తేదీన ఈ చొరబాట్లు జరిగినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

తొలిసారి గుర్రాలపై కూడా బలగాలు బోర్డర్‌లో తిరిగినట్లు నిఘా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. బర్హోతీలోని ఫుట్ బ్రిడ్జి కూడా చైనా సైన్యం కూల్చివేసిందని.... భారత్ సైన్యం ఆ ప్రాంతానికి చేరుకునే లోపే... అక్కడి నుంచి వెనక్కి వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత సైన్యంతో ముఖాముఖి తలపడేందుకు చైనా లిబరేషన్ ఆర్మీ బలగాలు ధైర్యం చూపడం లేదని తెలుస్తోంది. దీంతో నెల రోజులుగా బర్హోతీ ప్రాంతంలో ఇండో టిబెటలన్ బోర్డర్ ఫోర్స్... ఐటీబీపీ బలగాలు ఆ ప్రాంతంలో పహారా కాస్తున్నాయని నిఘా సంస్థ వెల్లడించింది. అయితే ఉత్తరాఖండ్‌లోకి చైనా బలగాలు చొరబాటుకు ప్రయత్నించినట్లు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. తూర్పు లఢఖ్‌లో పరిస్థితులు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. అక్కడ ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఉత్తరాఖండ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో... తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పు లఢఖ్ సమీపంలో గుడారాలను చైనా సైన్యం ఏర్పాటు చేసుకున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కావడంతో... ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: