ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో హైకోర్ట్ లో ఎన్నో ఇబ్బందులు పడుతుంది. నిధులను కొన్ని కొన్ని పనులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. హైకోర్ట్ విషయంలో నరేగా నిధుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది. ఇటీవల హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఇక ఇప్పుడు మరో కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం పట్ల హైకోర్ట్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నీరు చెట్టు పనులు బిల్లులు మంజూరు చేయకుండా విచారణ పేరిట జాప్యం చేయడంపై మండిపడిన హైకోర్టు... తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

తమకు 2017-18 సంవత్సరాల్లో చేపట్టిన పనులకు నేటి వరకూ బిల్లులు మంజూరు చేయకపోవడంపై హైకోర్టు లో 100 మంది పిటిషన్లు దాఖలు చేసారు. దీనిపై ప్రాధమిక అఫిడవిట్ కూడా సరైన సమాచారం ఇవ్వకుండా దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్లు కోర్టుకు    వచ్చాక ఇప్పడు విచారణ చేయడం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ఎన్ని కేసుల్లో విచారణ చేస్తున్నారు అని ప్రశ్నించింది. ఎంత మందికి బకాయిలు ఉన్నాయనే వివరాలు ఎందుకు కోర్టుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పనుల్లో అక్రమాలకు అధికారుల భాద్యత కూడా ఉంటుంది కదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ నిలదీసింది. అక్రమాలపై ఎంతమంది అధికారులపై చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదు లను హైకోర్ట్ ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఇన్ని సంవత్సరాలు తరువాత విచారణ పేరు తో బిల్లులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రభుత్వ న్యాయవాధిని హైకోర్టు విచారణ సందర్భంగా నిలదీసింది. పూర్తి వివరాలతో వచ్చేనెల 5వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయకపోతే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ప్రభుత్వాన్ని హైకోర్టు విచారణ సందర్భంగా హెచ్చరించింది. పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు హైకోర్ట్ న్యాయవాధి నర్రా శ్రీనివాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap