గులాబ్ తుఫాను బాధితుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్నారు అని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి అని ఆయన కోరారు. పార్టీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. బాధితులకు టీడీపీ నాయకులు, శ్రేణులు అన్ని విధాల అండగా నిలవాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రకృతి విపత్తుల సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో సమర్థంగా పనిచేసింది అని ఆయన పేర్కొన్నారు.

హుదూద్, తిత్లీ తుఫాన్లు సంభవించినప్పుడు ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచాం అని అన్నారు. గంటల వ్యవధిలో విద్యుత్ ను పునరుద్ధరించాం అని అన్నారు. అండర్ గ్రౌండ్ కేబులు వ్యవస్థను ఏర్పాటు చేశాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రైతులకు పంట నష్టం జరిగితే టీడీపీ హయాంలో తగిన విధంగా పరిహారం అందజేయడం జరిగింది అని వెల్లడించారు. జగన్ రెడ్డి మాత్రం క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుల్లో రైతులను దారుణంగా మోసం చేశారు అని ఆయన ఆరోపణలు చేసారు. అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు అని అన్నారు.

ఇప్పుడు గులాబ్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర బాగా దెబ్బతింది అని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని సూచించారు. దాదాపుగా 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి అన్నారు ఆయన. రోడ్లు దెబ్బతిన్నాయి అని తెలిపారు. జనజీవనం స్థంభించింది అని వ్యాఖ్యానించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆదుకుంటున్నారు అని అన్నారు. జగన్ రెడ్డి మాత్రం ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఆరోపించారు.  ఏ విపత్తు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహారం ఉంది అన్నారు. జగన్ రెడ్డికి ఇరిగేషన్ అంటే తెలియదు అని నీరు వృధా గా పోతున్నా నిర్లక్ష్యం వహించారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: