ఇక హుజురాబాద్ ఎలక్షన్లకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టిఆర్ఎస్ బిజెపి పార్టీలు తీవ్రంగా ఫోర్ కొనసాగిస్తున్నాయి. మేం గెలుస్తాం అంటే మేం గెలుస్తామంటూ ఆయా పార్టీల నాయకులు తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. మరి హుజురాబాదులో ఏ పార్టీకి సానుకూల స్పందన లభిస్తుంది.? ఏ నాయకుడు ప్రజల గుండెల్లో ఉన్నాడు..? ఇప్పటికి ఉపఎన్నికలకు  షెడ్యూలు కూడా వచ్చేసింది. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలను ఖరారు చేసింది. అలాగే అక్టోబర్ ఒకటో తేదీన  నోటిఫికేషన్ విడుదల కాగా నామినేషన్ వేయడం కోసం అక్టోబర్ 8 వ తేదీ, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 13వ తేదీని  గుర్తించారు.

30వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా నవంబర్ 2వ తేదీన ఫలితాలు విడుదల ఉన్నాయి. ఈ యొక్క ఉప ఎన్నిక యుద్ధం అనేది చివరి అంకానికి చేరుకుంది అని చెప్పవచ్చు. ప్రచారాన్ని ఆయా పార్టీల నేతలు జోరుగా కొనసాగిస్తున్నారు. ఓవైపు బిజెపి నేతలు, మరోవైపు టిఆర్ఎస్ నేతలు  హుజూరాబాద్ నియోజకవర్గం లో మోహరించారు. పోటాపోటీగా సభలు సమావేశాలతో, పాదయాత్రలతో ప్రజల్లో గడిపేందుకు  ఈ నెల రోజుల్లో ప్రజల మనసును గెలుచుకున్న ఎందుకు  నాయకులు ముందుకు వెళ్తున్నారు.

అధికార తెరాస పార్టీ నుండి  మంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ మరియు గంగుల కమలాకర్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు  నియోజకవర్గంలోనే మకాం వేసి తెరాస పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మరోవైపు బిజెపి పార్టీ నుంచి ఈటల రాజేందర్ ప్రతి గ్రామానికి వెళ్తూ తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ విధంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో  ప్రచార హోరు జోరుగా సాగుతోంది అని చెప్పవచ్చు. కానీ ప్రజల మనసులో ఈ నేత ఉన్నాడో ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యే వరకు చెప్పలేం..

మరింత సమాచారం తెలుసుకోండి: