హామీలు అన్నవి ఎంతో చేస్తాయి. పవర్ ఫుల్ హామీలు పవర్ ని ఏకంగా తెచ్చి ఓడిలో పడవేస్తాయి. మరి హామీలు అన్నది గతంలో కంటే కూడా ఇపుడు బాగా వర్కౌట్ అవుతున్నాయి. జనాలలో అంతకంతకు కోరికలు కూడా పెరిగిపోతున్నాయి.

దానికి తగినట్లుగా నాయకులు కూడా హామీలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ మంచి హామీలనే ఇచ్చింది. జనాల మనసు దోచుకుని అధికారం చేపట్టింది. అలా ఇలా కాదు బంపర్ మెజారిటీతో గెలుపు సాధించింది. అధికారంలోకి వచ్చాక జగన్ వాటిని నెరవేర్చే పనిలో బాగానే చిత్తశుద్ధి కనబరుస్తున్నారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల కోసం మళ్ళీ హామీల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఈసారి ఎలాంటి హామీలు ఇవ్వాలి అన్నది ఇంకా అధికార వైసీపీ కసరత్తు చేస్తున్నట్లుగా లేదు. కానీ మరో వైపు విపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం హామీల విషయంలో పెద్ద ఎత్తున చేయాల్సింది అంతా చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధితో పాటు ఏపీ అంతటా అభివృద్ధి వంటి హామీలు చాలానే ఉన్నాయి. అదే విధంగా జగన్ కి ఎంతో ఇష్టమైన హామీ పెన్షన్ విషయంలో టీడీపీ గురి చూసి మరీ కొడుతోంది. తాము అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని జగన్ నాడు చెప్పారు.

అయితే ఆయన వచ్చి రెండున్నరేళ్లు గడచినా రెండు వేల రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఆర్ధికపరమైన ఇబ్బందుల వల్లనే జగన్ అలా చేస్తున్నారు. ఇక మరో రెండేళ్ళలో అయినా జగన్ మూడు వేల రూపాయల హామీని నిలబెట్టుకుంటే ఫరవాలేదు, అయితే  వచ్చే ఎన్నికల్లో ఆ హామీని కూడా తలదన్నేలా చంద్రబాబు మూడున్నర వేల రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తామని చెప్పబోతున్నారుట. అదే కనుక జరిగితే మాత్రం జగన్ కి అతి పెద్ద షాక్ అనే చెప్పాలి. జగన్ దాన్ని అధిగమించేలా నాలుగు వేల రూపాయలు నెలకు పెన్షన్ అని చెప్పాలి. మరి జగన్ అలా చేయగలరా. చూడాలి మరి.






మరింత సమాచారం తెలుసుకోండి: