అధికార పార్టీ అన్నాక ఆధిపత్య పోరు సహజమే...నాయకులు ఓవర్ ఫ్లో అవ్వడంతో, ఆధిపత్య పోరు వచ్చేస్తుంది. ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీది కూడా అదే పరిస్తితి. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో....ఏదొక నియోజకవర్గంలో వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ఈ ఆధిపత్య పోరు మరీ పీక్స్‌లో ఉంది.

ఇక్కడ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. దర్శి వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. వీరి మధ్యే రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు. పూర్తిగా కంటిన్యూ అయ్యేలా ఉంది. దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ది ఒక వర్గం...మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిది మరో వర్గం. ఇక టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావుది కూడా ఒక వర్గం ఉంది.


ప్రధానంగా మద్దిశెట్టి, బూచేపల్లిలకు పడటం లేదు. గత ఎన్నికల్లో బూచేపల్లి వైసీపీ నుంచి పోటీ చేయాల్సి ఉంది. కానీ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉండటంతో బూచేపల్లి రంగంలోకి దిగలేదు. దీంతో వైసీపీ అధిష్టానం మద్దిశెట్టికి టిక్కెట్ ఇచ్చింది. మద్దిశెట్టి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఇటు వైసీపీ అధికారంలోకి రావడంతో బూచేపల్లి యాక్టివ్ అయ్యారు. ఆయన వర్గం కూడా సెపరేట్‌గా రాజకీయం చేస్తుంది. పదవులు, కాంట్రాక్టుల విషయంలో వీళ్ళ మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. మధ్యలో శిద్ధా వర్గం కూడా రాజకీయం మొదలుపెట్టింది.

అసలు నెక్స్ట్ ఎన్నికల్లో ఒకరికి టిక్కెట్ ఇస్తే మరొకరు ఓడించడానికి రెడీగా ఉన్నారు. అంటే పరోక్షంగా టి‌డి‌పికి బెనిఫిట్ చేసేలా ఉన్నారు. తాజాగా టి‌డి‌పి ఇంచార్జ్‌గా పమిడి రమేష్‌ని నియమించారు. ఈయనకే నెక్స్ట్ దర్శి సీటు వచ్చేలా ఉంది. వైసీపీలో ఉన్న లుకలుకలే రమేష్‌కు బాగా బెనిఫిట్ అయ్యేలా ఉంది. ఈ రచ్చ ఎలాగో తగ్గేలా లేదు కాబట్టి...రమేష్ కాస్త పుంజుకుంటే టి‌డి‌పికే బెనిఫిట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp