టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల దోస్తీ ఖాయమైందని ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే...ఎలాగో చంద్రబాబు సింగిల్‌గా జగన్‌ని ఎదురుకోలేకపోతున్నారు కాబట్టి...పవన్ సపోర్ట్‌తో జగన్‌కు చెక్ పెట్టడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం నడుస్తోంది. అటు పవన్ సైతం...బాబుతో కలిస్తేనే జనసేనకు కొన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు.

పైగా విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి...అది వైసీపీకే ప్లస్ అవుతుంది. గత ఎన్నికల్లో అదే జరిగింది....అందుకే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బాబు-పవన్‌లు దోస్తీ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు రాజకీయం కూడా నడిపిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా కొన్ని నియోజవర్గాలకు చంద్రబాబు ఇంచార్జ్‌లని నియమించడం బట్టే చూస్తే అదే అర్ధమవుతుంది.

అలాగే కొన్ని నియోజకవర్గాల్లో నేతలు యాక్టివ్ గా లేకపోయినా సరే ఇంచార్జ్‌లని పెట్టలేదు. అంటే ఆ సీట్లు జనసేనకు ఇచ్చేయడానికే చంద్రబాబు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటుని జనసేనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సీటుని బి‌జే‌పికి ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున జలీల్ ఖాన్ కుమార్తె షబానా పోటీ చేసి, వైసీపీ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్‌పై ఓడిపోయారు. ఓడిపోయాక షబానా విదేశాలకు వెళ్ళిపోయారు...అటు జలీల్ వయసు మీద పడటంతో నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండటం లేదు.

అయినా సరే చంద్రబాబు...ఇక్కడ టి‌డి‌పి ఇంచార్జ్‌ని పెట్టలేదు. అంటే నెక్స్ట్ ఈ సీటు జనసేనకు ఇవ్వడానికే పోటీ పెట్టలేదని తెలుస్తోంది. వెస్ట్‌లో జనసేన తరుపున పోతిన మహేష్ దూకుడుగా పనిచేస్తున్నారు. వెల్లంపల్లిపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. వెల్లంపల్లి అక్రమాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇలా దూకుడుగా ఉన్న పోతిన మరొకసారి జనసేన నుంచి పోటీ చేయడం ఖాయం. ఇక టి‌డి‌పి పొత్తులో భాగంగా ఈ సీటుని జనసేనకే వదిలేస్తుందని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp