టి‌డి‌పి అధినేత చంద్రబాబు...ఈ మధ్య సడన్ ట్విస్ట్‌లు ఇస్తున్నారు...మొన్నటివరకు పార్టీలో పనిచేయని నేతలనీ....చూసి చూడనట్లుగా వదిలేశారు...కానీ ఇకనుంచి అలా ఉండేలా కనిపించడం లేదు. పార్టీ బలోపేతం కోసం పనిచేయని నేతలనీ ఏ మాత్రం మొహమాటం లేకుండా సైడ్ చేసేలా కనిపిస్తున్నారు. అందుకే తాజాగా కూడా ఆరు నియోజకవర్గాల్లో నాయకులని పక్కనబెట్టేసి....కొత్తవారికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.

అయితే ఇందులో ఎన్నో ఏళ్లుగా టి‌డి‌పిలో పనిచేస్తున్న కొందరు మాజీ ఎమ్మెల్యేలని సైతం పక్కనబెట్టేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. అంటే పార్టీ కోసం పనిచేయకపోతే ఎవరినైనా పక్కనబెట్టేయడం ఖాయమని బాబు హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు సాలూరు నియోజకవర్గంలో రాజేంద్ర ప్రతాప్ భాంజ్...మూడు సార్లు టి‌డి‌పి తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు...2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు.

అయితే ఓడిపోయినా పర్లేదు గానీ, ఆయన మళ్ళీ సాలూరులో టి‌డి‌పిని బలోపేతం చేసే కార్యక్రమం ఒక్కటీ చేయడం లేదని తెలిసింది. దీంతో ఆయన్ని సైడ్ చేసేసి....సాలూరు ఇంచార్జ్‌గా గుమ్మడి సంధ్యారాణిని నియమించారు. అటు మాడుగుల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని తప్పించి, పీవీజీ కుమార్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. 2009లో రామానాయుడు మాడుగులలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు...ఈ ఓటములకు రామానాయుడు సొంత తప్పిదాలే కారణమని తెలుస్తోంది. ఆయన ఏ కోశాన పార్టీ బలోపేతం కోసం కృషి చేయకపోవడంతో చంద్రబాబు, ఆయన్ని తప్పించి కుమార్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు.


అటు భీమవరంలో యాక్టివ్‌గా లేని మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుని సైడ్ చేసి, తోట సీతారామలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. ఇక పామర్రులో ఏ మాత్రం పార్టీలో కనిపించని మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనని పక్కనబెట్టి, వర్ల కుమార్ రాజాని ఇంచార్జ్‌గా పెట్టారు. అంటే మాజీ ఎమ్మెల్యేలు అయినా సరే పనిచేయకపోతే...పక్కనబెట్టేస్తానని బాబు...అందరికీ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అయితే సైడ్ అయిన ఈ మాజీ ఎమ్మెల్యేలు..ఇప్పుడు తమ దారి తాము చూసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp