గత కొన్ని రోజులుగా టి‌డి‌పి-జనసేనలు పొత్తు పెట్టుకోబోతున్నాయని ఏపీ రాజకీయాల్లో ప్రచారం పీక్స్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్‌ని సింగిల్ గా ఎదురుకోవడం కంటే...కలిసి కట్టుగా ఎదురుకోవడమే బెటర్ అని చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. పైగా కలిస్తే ఏమవుతుందో...2014 ఎన్నికలు రుజువు చేశాయి...అలాగే విడిపోతే ఏం జరుగుతుందో 2019 ఎన్నికలో నిరూపించాయి. టి‌డి‌పి-జనసేనల మధ్య ఓట్లు చీలిపోయి చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి బాగా ప్లస్ అయింది.

అయితే ఈ సారి మాత్రం ఆ తప్పు చేయకూడదని చంద్రబాబు-పవన్‌లు గట్టిగానే కోరుకుంటున్నట్లు కనబడుతోంది...అందుకు కలిసి పనిచేయాలని ఫిక్స్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఇక బాబు-పవన్‌లు కలిస్తే...కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడటం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి టి‌డి‌పి మీద వచ్చిన మెజారిటీ కంటే...జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ. అంటే అప్పుడే టి‌డి‌పి-జనసేనలు కలిస్తే వైసీపీ పరిస్తితి ఏమయ్యేదో చెప్పాల్సిన పనిలేదు.

అయితే టి‌డి‌పి-జనసేనలు కలిస్తే ఏ వైసీపీ ఎమ్మెల్యేకు ఇబ్బంది అవుతుందో తెలియదు గానీ...ఆ రెండు పార్టీలు కలిస్తే మంత్రి కొడాలి నానికే పెద్ద ప్లస్ అని తెలుస్తోంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టి‌డి‌పికి పవన్ సపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే...అయినా సరే గుడివాడలో కొడాలి నాని వైసీపీ నుంచి గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో గుడివాడలో జనసేన పోటీ చేయలేదు. మళ్ళీ కొడాలి ఎమ్మెల్యేగా గెలిచేశారు. ఇప్పుడు మంత్రిగా దూసుకెళుతున్నారు.

ఇక కొడాలి నాని ఏ స్థాయిలో....పవన్-చంద్రబాబులపై ఫైర్ అవుతున్నారో చెప్పాల్సిన పని లేదు. వారిద్దరు కలిసొచ్చినా సరే జగన్‌ని ఓడించలేరని అంటున్నారు. అయితే వారిద్దరు కలిస్తే కొడాలి నానికి కూడా పోయేది ఏం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే గుడివాడలో ఉన్న కాపు ఓటర్లు ఎక్కువగా కొడాలి వైపే ఉంటారు...పవన్ చెప్పినా సరే వారు...కొడాలికే సపోర్ట్ ఇస్తారు. కాబట్టి గుడివాడలో కొడాలికి చెక్ పెట్టడం బాబు-పవన్‌లకు సాధ్యం కాదనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: