మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌  ఓడిపోయాడు. ఎంతో సీనియర్ నటుడైన ప్రకాశ్‌ రాజ్‌.. జాతీయ అవార్డులు అందుకున్న ప్రకాశ్‌రాజ్.. పెద్దగా సక్సస్‌లు లేని.. ఓ కుర్ర హీరో మంచు మనోజ్ చేతిలో ఓడిపోయాడు.. అయితే ఏ ఎన్నికల్లో అయినా గెలుపు ఓటములు సహజం. కానీ.. ప్రకాశ్‌రాజ్  మాత్రం ఈ ఓటమిని తేలిగ్గా తీసుకునేలా కనిపించడం లేదు. తనకు నాన్ లోకల్ అన్న అంశాన్ని ఫోకస్‌ చేసి.. మా సభ్యుల్లో ఆ ఫీలింగ్‌ రప్పించి ఓడించినందు వల్ల తాను మా సభ్యుడిగా కొనసాగ లేనని ప్రకాశ్‌ రాజ్ తేల్చి చెప్పారు.


మా సభ్యత్వానికి ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా చేశారు. తన రాజీనామాను విష్ణుకు పంపి ఆమోదించాలని కోరారు. అంతే కాదు.. తన రాజీనామా అంశాన్ని ఆయన ఓ ప్రెస్ మీట్‌ ద్వారా సవివరింగా విలేఖరులకు వివరించారు. అయితే ప్రకాశ్ రాజ్ రాజీనామాను ఆమోదించేది లేదని విష్ణు సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలిపారు. ప్రకాశ్‌ రాజ్ ఎమోషనల్‌ గా ఉండి.. నిర్ణయం తీసుకున్నారని.. తాను పర్సనల్‌గా కలిసి ఆయన్ను రాజీనామా ఉపసంహరణకు ఒప్పిస్తానని విష్ణు చెబుతున్నారు.


అయితే విష్ణు ప్రెస్ మీట్ తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన ప్రకాశ్ రాజ్..  ప్రియమైన మా సభ్యులు, మాకు మద్దతుగా నిలిచారని... వారికి కృతజ్ఞతలు అంటూ సంభోదించారు. తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ సభ్వత్వానికి రాజీనామా కి రాజీనామా చేయడం వెనుక లోతైన అర్థం ఉందని పవన్ కల్యాణ్ అంటున్నారు. మా సభ్యులందరూ మాకు అందించిన ప్రేమ మరియు మద్దతు పట్ల మేము బాధ్యత వహిస్తున్నట్లు ఒక బృందంగా మాకు తెలుసన్నారు ప్రకాశ్ రాజ్.


మేము మీ అందరినీ నిరాశపరచబోమన్న ప్రకాశ్ రాజ్.. అతి త్వరలో అన్ని విషయాలు వివరిస్తా మమన్నారు. అంతే కాదు.. మీరు మా గురించి గర్వపడతారు....అంటూ సదరు పోస్టులో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: