రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సార‌ధ్య‌ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత పార్టీలో కొత్త ఉత్సాహం వ‌చ్చించి. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లోనూ ఆ ప్ర‌భావం ఉంటుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు భావించాయి. కానీ, ఇంత కాలం వ‌ర‌కూ కాంగ్రెస్ హుజురాబాద్‌పై ఫోక‌స్ పెట్ట‌లేదు. ఇప్పుడు భారీ బృందంతో రంగంలోకి దిగుతోంది. 20 మంది స్టార్ కాంపెయిన‌ర్స్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది పార్టీ అధిష్టానం. ఈ జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, అలాగే భ‌ట్టి విక్ర‌మార్క, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, శ్రీ‌ధ‌ర్ బాబు, జీవ‌న్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర్సింహ రెడ్డి, మ‌ధుయాష్కి త‌దిత‌రులున్నారు.


  హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీ-టీఆర్ఎస్ మ‌ధ్యే ప్ర‌ధాన‌మైన పోటీ ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే, ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కూడా స‌త్తా చాటాల‌ను ఉవ్విళ్లూరుతోంది. అయితే, ఈ ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డికి సీనియ‌ర్లు ఎంత‌మేరకు స‌హ‌క‌రిస్తార‌నే కొంత కాలంగా చ‌ర్చ న‌డుస్తోంది. ప‌లువురు సీనియ‌ర్లు ఇప్ప‌టికే రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ఎంత మంది రేవంత్ రెడ్డితో ఎంత మంది సీనియ‌ర్ నేత‌లు క‌లిసి వ‌స్తారోన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చజ‌రుగుతోంది.


  అయితే, ఈ విష‌యంలో రేవంత్ రెడ్డికి జ‌గ్గారెడ్డి, శ్రీ‌ధ‌ర్‌బాబు, జీవ‌న్ రెడ్డి లాంటి సీనియ‌ర్ నాయ‌కులు స‌హ‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను కూడా టీపీసీసీ అప్ప‌గించింది. ఇటీవ‌ల హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహం పై చ‌ర్చించిన తెలంగాణ టీపీసీసీ ముఖ్య‌నేత‌ల స‌మావేశం ఆశించిన విధంగానే సాగ‌డంపై కాంగ్రెస్ నేత‌లు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.



దీంతో రేవంత్ రెడ్డికి సీనియ‌ర్ల‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్ ను త‌గ్గించేందుకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వినిపిస్తోంది.  మ‌రోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాస్త దూరంగ ఉన్న వారి జాబితాలో కొమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌హ కొంతమంది నేత‌లు మాత్ర‌మే ఉన్నార‌ని త్వ‌ర‌లోనే వాళ్లు కూడా రేవంత్ రెడ్డితో క‌ల‌సి పనిచేసే అవ‌కాశం లేక‌పోలేద‌ని కాంగ్రెస్ లోని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.












మరింత సమాచారం తెలుసుకోండి: