అమెరికా బ‌ల‌గాల నిష్ర‌మ‌ణ అనంత‌రం తిరుగుబాటు చేసిన తాలిబ‌న్ అఫ్గ‌నిస్తాన్‌లో మ‌ళ్లి 20 ఏళ్ల త‌రువాత అధికారాన్ని చెపట్టారు. ఈ క్ర‌మంలో తాము మార‌మ‌ని చెప్పుకొస్తున్నారు. కానీ ఆ మాట‌లు నీటి మూట‌లే అని తేలిపోయాయి. ష‌రియా చ‌ట్టాలు అమలు చేస్తూ మ‌ధ్య‌యుగంలోని ప‌రిస్థితుల‌కు అఫ్గ‌నిస్తాన్‌ను తీసుకువెళ్లేందుకు తాలిబ‌న్ లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక క‌ఠిన శిక్ష‌లు, నిబంధ‌న‌లు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల పై అనేక క‌ఠిన నియ‌మ నిబంధ‌న‌ల‌ను తాలిబ‌న్‌లు జారీ చేశారు. వ‌స్త్ర‌ధార‌ణ నుంచి చ‌దువు, ఉద్యోగాల విష‌యంలో మ‌హిళ‌ల‌కు క‌ఠిన నిబంధ‌న‌లు పెట్టింది తాలిబ‌న్ ప్ర‌భుత్వం.


   ష‌రియా చ‌ట్టాలు అంటే అఫ్గనిస్తానీయులే కాకుండా  ప్ర‌పంచం మొత్తం భ‌య‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలో  ష‌రియా చ‌ట్టాల‌కు అనుగుణంగా పాల‌న‌ను కొన‌సాగిస్తున్న తాలిబ‌న్‌లు. ఈ సారి మ‌రో వింతైన శిక్ష‌ను అమ‌లు చేస్తున్నారు. తాను త‌ప్పు చేసి ఇత‌రుల‌కు శిక్ష‌వేసే విధంగా ఉంటుంది ఇది. అయితే, ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిది తాలిబ‌న్‌లు అంద‌రికీ తెలుసు. వారికి వ‌చ్చే నిధుల్లో అత్య‌ధికంగా వీటి ద్వారానే స‌మ‌కూరుతుంది. ఓపీఎం డ్ర‌గ్స్‌ను పండించేది తాలిబ‌న్లు. ఆ పంట‌ను పండించాల‌ని చెప్పేది కూడా తాలిబ‌న్ నేత‌లే.


  అయితే, తాలిబ‌న్‌లు డ్ర‌గ్స్ త‌యారు చేయొచ్చు, అమ్ముకోవ‌చ్చు, అలాగే వాడొచ్చు కానీ, త‌మ దేశంలో ప్ర‌జ‌లు మాత్రం డ్ర‌గ్స్ వినియోగించ‌రాద‌ని ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ డ్ర‌గ్స్ వాడితే ష‌రియా చ‌ట్టం అనుగుణంగా శిక్ష‌లు విధిస్తారు. డ్ర‌గ్స్ వాడిన వారికి తిండి పెట్ట‌కుండా గుండు కొట్టించి బంధిస్తారు. అయితే, తాలిబ‌న్‌ల మ‌ద్ధ‌తుతో డ్ర‌గ్స్ వాడొచ్చంటా వాళ్ల‌కు తెలియ‌కుండా డ్రగ్స్ వాడితే ఇలాంటి శిక్ష‌లు ఉంటాయ‌ని క‌ఠినంగా వ్య‌వ‌హిర‌స్తామ‌ని తాలిబ‌న్‌లు ప్ర‌క‌టించారు.  వాస్త‌వానికి ఇస్లాం ప్ర‌కారం.. మ‌ద్యం నిషేదం, డ్ర‌గ్స్ వాడ‌కం నిషేధం ఉంది. కానీ, ఇస్లాం పేరుతో అల్లా పేరుతో పాల‌న కొన‌సాగించే వాళ్లు మాత్రం డ్ర‌గ్స్ ఉత్ప‌త్తి చేసి అమ్మేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: