జాతీయ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం చాలా పట్టుదలగా వ్యవహరిస్తుంది. చాలా వరకు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి అన్ని పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తన పార్టీ నేతలను అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నారు అందరితో మాట్లాడుతున్నారు. నిన్న ఏపీ సిఎం వైఎస్ జగన్ తో తమిళనాడు అధికార పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. సిఎం జగన్ వద్ద తమ అభిప్రాయలు చెప్పారు. జగన్ కూడా అందుకు సానుకూలంగా స్పందించారు అని శాసన సభలో బిల్ పెట్టడానికి ఒకే అన్నారు అని ప్రచారం చూసాం.

ఇప్పుడు తెలంగాణా మంత్రి కేటిఆర్ వద్దకు డిఎంకె ఎంపీలు వచ్చి మాట్లాడి తమ ఆలోచనను పంచుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను కేటీఆర్ కు డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు అందించారు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ 12 మంది సీఎం లకు లేఖ రాసారు స్టాలిన్. ఎంపీలు.. ఇలంగోవన్, వీరస్వామి ఆయనతో భేటీ అయ్యారు. నీట్ రద్దు చేయాలనే డిమాండ్ కు మద్దతు ఇవ్వాలని లేఖ రాసారు. ఇలగోవన్ మాట్లాడుతూ నీట్  పరీక్ష రద్దు అంశం పై కేటీఆర్ ను కలిసాము అని చెప్పారు.

విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నీట్ పరీక్ష అంశం పై మేము నిర్ణయం తీసుకున్నాము అని అన్నారు. కేంద్ర విధానంపై మేము నిరసన చేస్తున్నాము అని అని పేర్కొన్నారు. మాకు సపోర్ట్ చెయ్యాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆడిగాము అన్నారు. కేంద్రం కీలకమైన విషయాలలో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదు అని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీలు కేటీఆర్ ను కలిశారు అని అన్నారు. లెటర్ తీసుకొచ్చి కేటీఆర్ కి స్వయంగా అందించి సపోర్ట్ అడిగారు అని నీట్ పరీక్ష రద్దు అంశం పై ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కేసీఆర్ కు లేఖ రాశారు అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts