ఏపీలో సాధార‌ణ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు మాత్రమే సమయం ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు నిద్రాణ స్థితిలో ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న ప‌రిస్థితి ఉంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌లు టీడీపీలో చాలా మంది నేత‌ల‌కు జీవన్మరణ సమస్య గా మారాయి. ఆ లిస్టులోనే మాజీ మంత్రి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా ఉన్నారు. ఆమె ఈ ఎన్నిక‌ల‌లో గెలిచి ప‌ట్టు నిలుపుకుంటేనే ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల రాజ‌కీయాల్లో ఆమె  భ‌విష్య‌త్తు లో నెగ్గుకు రాగ‌లుగు తారు.. లేక‌పోతే ఆమె రాజ‌కీయ జీవితం దాదాపు ముగిసింద‌నే చెప్పాలి.

గ‌త ఎన్నిక‌ల‌లో ఆమె ఆళ్ల‌గ‌డ్డ‌లో చిత్తు గా ఓడిపోయారు. మ‌రో వైపు ఆమె సోద‌రుడు నంద్యాల‌లో ఓడిపోయారు. ఇక ఎన్నిక‌ల‌లో ఓడిపోయాక ఆమె రాజ‌కీయంగా మ‌రింత సంక‌ట స్థితిలో ప‌డిపోయారు. అఖిల ఇప్పటికే అనేక కేసుల్లో ఇరుక్కుని సతమతమవుతున్నారు. పైగా ఆమె భ‌ర్త తీరు వ‌ల్ల కూడా ఆమె రాజ‌కీయంగాను.. అటు ఫ్యామిలీ లోనూ ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రో వైపు సోద‌రి మౌనిక తో కూడా ఆమెకు ఆస్తి పంప‌కాల్లో విబేధాలు ఉన్నాయంటున్నారు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఆమె సీటు ద‌క్కించు కోవ‌డం.. గెల‌వ‌డం సంగ‌తి అటు ఉంచితే ముందుగా ఆమె కుటుంబంలో విబేధాల‌ను చ‌క్క పెట్టుకోవాలి. ఇదే ఇప్పుడు భూమా అఖిలప్రియ ముందు పెద్ద టాస్క్ లాగా ఉంది. కుటుంబంలో విబేధాలు చక్క దిద్దు కోపోతే చంద్ర‌బాబు ఆమెకు సీటు ఇస్తారా ? అన్న‌ది డౌట్‌. ఇక గంగుల కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కొనాలంటే తిరిగి కుటుంబ సభ్యులను కూడా క‌లుపుకుని పోవాల్సి ఉంది. ప్ర‌స్తుతం అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గానే పాలు పంచుకుంటున్నారు. ఆమె అక్క‌డ ఎంత స్థానికంగా ఉంటున్నా కుటుంబాన్ని క‌లుపు కుంటేనే ఆమె ఆళ్ల‌గ‌డ్డ‌పై తిరిగి ప‌ట్టు సాధిస్తారు ? అన‌డంలో సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: