విశాఖలో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన ఒక ఘటన పోలీసులకు కూడా చుక్కలు చూపించింది. దీనిపై నేడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసులు వర్షన్ కు బాలిక తల్లిదండ్రులు చేప్పేదానికి చాల తేడా ఉంది అని అన్నారు. ఇందులో విచారణ సరిగ్గా జరగలేదని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు అంటూ...

బాలిక చనిపోయిన స్థలాన్ని పరిశీలించిన తరువాత పోలీసులు రెండు ప్రాంతాలన్ని పరిశీలించాలని అనిపిస్తుంది అన్నారు ఆయన. బాలిక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే దుకేస్తుంది తప్ప గోడమీద కూర్చోని దూకదు అని అన్నారు. ఈ విషయం పై ఇంకా విచారణ చేయాలి అని ఆయన అన్నారు. తల్లి చెప్పినట్టు పలు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు చేప్పేది కరెక్టా పోలీసులు కరెక్టా అనేది పోలీసులు తేల్చాలి అని ఆయన పేర్కొన్నారు. లిప్ట్ లో ఇతర ప్రదేశాల్లో రక్తపు మరకలు ఉన్నాయి అంటున్నారు అని అలాంటప్పుడు పోలీస్ జాగిలాలు ఎందుకు పిలవలేదు అని ప్రశ్నించారు. దీనిపై కమీషనర్ తో మాట్లాతా అన్నారు ఆయన. జాగిలాలతో ఎందుకు తీసుకొచ్చి విచారణ చేయాలేదో అర్థం కావడం లేదు అని వ్యాఖ్యానించారు. బాలిక గురించి ఎవ్వరు చెడ్డగా మాట్లాడవద్దు అన్నారు. బాలికను హత్య చేసి ఉంటే వారిని వదిలిపెట్టేది లేదు అని వ్యాఖ్యానించారు.

ఖచ్చితంగా కఠిన శిక్షలు వేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు బాలిక మృతి చెందగానే అన్ని కోణాల్లో విచారణ చెయ్యాలని చెప్పాము అన్నారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడమని వివరించారు. నిందితుడుకి కఠినంగా శిక్షించాలని కోరారు అన్నారు. బాలిక తండ్రి కామెంట్స్ చూస్తే, మా పాపను చంపేసి కిందకు తీసుకువచ్చారు ఖచ్చితంగా ఇది హత్యే అన్నారు ఆయన. ఇంకో పాపకు ఇలా జరగకుడదు న్యాయం చెయ్యాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap