బద్వేల్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలవాలని వైసీపీ భావిస్తుంది. ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు కాస్త దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు ప్రచారానికి వెళ్ళిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... 2004 ముందు తరువాత బద్వేలులో చాలా మార్పులు వచ్చాయి అని అన్నారు. బ్రహ్మం సాగర్ ద్వారా ఏడు మండలాలకు నీరు అందించాం అని ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులు కృష్ణా నీటితో నింపిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డి ది అని ఆయన కొనియాడారు.

కరవు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసాం అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు 15 సంవత్సరాలు బద్వేలును పట్టించుకోలేదు అని విమర్శించారు. సమస్యను ప్రస్తావిస్తే కనీసం పట్టించుకోలేదు అన్నారు ఆయన. టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బద్వేలు కు తాగు , సాగు నీరు అందిస్తున్నాం అన్నారు ఆయన. కృష్ణా నీటిని అందించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాం అని వెల్లడించారు. బద్వేలుకు ఎవరు మేలు చేశారన్న విషయం ప్రజలకు తెలుసు అని అన్నారు.

బద్వేలు ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తున్నాం అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా అందిస్తున్నాం.. ఎలక్షన్ వల్ల కడప జిల్లాలో ఆగిపోయింది అని అప్పుడు వైఎస్ఆర్ , ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి వల్లే మేము ధైర్యంగా ఓటు అడుగుతున్నాం అన్నారు. మీ హయాంలో ఏం చేశారో ధైర్యంగా చెప్పగలరా అని సవాల్ చేసారు. విద్య , వైద్య రంగాల్లో అభివృద్ధి జరిగింది అన్నారు. తండ్రి , కొడుకులు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి అందించారు అని తెలిపారు. బద్వేలు మునిసిపాలిటీ కి 130 కోట్లతో అభివృద్ధి పనులు చేయబోతున్నాం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి చిత్తశుద్ధి వుంది కాబట్టి ధైర్యంగా ఓటు అడుగుతున్నాం అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: