క‌రోనా త‌రువాత పారిశ్రామిక ప్ర‌గ‌తి ఇప్పుడిప్పుడే వ‌స్తుంది. వినియోగం బాగా పెరిగింది. గృహావ‌స‌రాలు త‌గ్గించుకోవాలి.. ఇలాం టివి ఇక‌పై త‌రుచూ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి చెప్ప‌బోతున్నారు. అందుకు ఇంకా మీరు సిద్ధంగా ఉండండి. అదేవిధంగా బొగ్గు నిక్షే పాల కొనుగోలుపై డ‌బ్బులు లేనందున ఇప్ప‌టికిప్పుడు ఆ స‌మ‌స్య తీరేలా లేదు. ప‌థ‌కాల‌కు మాత్రం డ‌బ్బులు సిద్ధం చేసే హ‌డా వుడిలో మ‌రికొన్ని ఆస్తుల‌యితే అమ్ముతారు అని విప‌క్షం ఆరోప‌ణ చేస్తోంది. ఏదేమ‌యినా విప‌క్షం మ‌రింత ఫైట్ చేయాలి.

విశాఖ కేంద్రంగా విజ‌య్ సాయి రెడ్డి ఏం మాట్లాడినా లేదా రాజ‌ధాని కేంద్రంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి ఏం మాట్లాడినా విద్యుత్ త‌గాదా ఇప్ప‌ట్లో తేలేలా లేదు. చీక‌టి రోజులు రానున్నాయి అన్న‌ది సుస్ప‌ష్టం అయిపోయింది. ప‌రిశ్ర‌మ‌ల‌కు నిలుపుద‌ల చేసి గృహావ‌స‌రాల‌కు విద్యుత్ పంపిణీ చేయ‌డంలో అర్థం లేదు. అలాంటి నిర్ణ‌యాలు కార‌ణంగా ఎవ్వ‌రికీ ఉప‌యోగం ఉండ‌దు. పారిశ్రామిక ప్ర‌గ‌తి రెండున్న‌రేళ్లుగా ఏమీ లేదు. ఇలాంటి ద‌శ‌లో రాష్ట్రం ఎటు పోతోంది. ప‌దేళ్లుగా క‌రెంటు కోత అంటే ఏంటో తెలియ‌ని రాష్ట్రానికి ఏంటీ స‌మ‌స్య‌?


వాడ‌కం ఎక్కువ‌గా ఉంది అని అంటున్నారు ప్ర‌భుత్వ పెద్ద స‌జ్జ‌ల. వాడ‌కం ఎలా ఉన్నా స‌ప్లై పై మీరు ఎందుకు దృష్టి సారించ‌డం లేదు అని నిల‌దీస్తున్నాయి విద్యుత్ విష‌య‌మై విప‌క్షాలు. మ‌రో నాలుగైదు రోజుల‌లో విద్యుత్ సంక్షోభం అన్న‌ది షురూ కానుంది. అవును! అనుకున్న దాని కంటే ఎక్కువ‌గానే ఈ స‌మ‌స్య ఉంద‌న్న‌ది ఇప్ప‌టికే సుస్ప‌ష్టం అయింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం చేయ‌నుంది అన్న‌ది స‌ర్వ‌త్రా ఆస‌క్తిదాయకంగా మారింది. ముఖ్యంగా కొనుగోలుకు సంబంధించి గ‌తంలో సీఎం అనుస‌రించిన విధానాలే కొంప ముంచాయి అని అంటున్నారు ఇంకొంద‌రు. త‌మ‌కు అనుకూలం అయిన సంస్థ‌ల నుంచి విద్యుత్ కొనుగోలు పై ఆస‌క్తి పెంచుకుని ఇప్పుడు రాష్ట్రాన్ని న‌ట్టేట ముంచార‌ని కొంద‌రి ఆరోప‌ణ. ఈ ద‌శ‌లో ఏం జ‌ర‌గ‌నుంది?


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp