అమెరికా తనపై దాడులు చేసిన తీవ్రవాదులను పట్టుకుని తీరుతా అంటూ శపధం చేసి మరి ఆఫ్ఘన్ లో అడుగు పెట్టింది. కానీ రెండు దశాబ్దాలుగా వాళ్ళు అమెరికా సైన్యం కళ్ళు కప్పి పాక్ లో ఉన్నారు. ఇదంతా తెలుసుకోవడానికి అంత సాంకేతికత ఉన్న అమెరికాకు ఇంత సమయం పట్టిందా.. లేక ఇదంతా ఎవరో పన్నిన వలలో చేపలగా అమెరికా చిక్కిందా.. అనేది పక్కన పెడితే మొత్తానికి అందులోంచి తప్పించుకొని ఇటీవలే బయట పడిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా కోట్ల వీలువ చేసే అనేక ఆయుధ పరికరాలు, ఇతర ఆయుధాలు అక్కడే వదిలేసి వెళ్ళింది. దీనినే ట్రంప్ కూడా ప్రత్యేకంగా చెప్పి మరి బైడెన్ ప్రభుత్వాన్ని విమర్శించాడు.

అయితే ఇప్పుడు అవి అన్ని ఆఫ్ఘన్ ను ఆక్రమించుకున్న తాలిబన్ లు వాడుతారు అనుకుంటే, అవన్నీ పాక్ ఉగ్రకేంద్రంలో అమ్మకానికి ఉంచబడ్డాయి. అవి పాక్ అమ్ముతున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అమెరికా వదిలి వెళ్లిన ప్రతి యుద్ద సామాగ్రిని సంతలో సమానులాగా పెట్టి మరి అక్కడ అమ్మేస్తున్నారు. వాటిని ఆఫ్ఘన్ ఎందుకు వాడలేదు, వారికి అంతకంటే గొప్ప ఆయుధాలు లభించాయనా లేక వారి ఆయుధాలు కూడా శాస్త్రీయంగా ఉండాలని వాటిని పాక్ కు ఇచ్చేశారా అనేది తెలియాల్సి ఉంది. పాత కాలం నాటి వాళ్ళు కాబట్టి పాతకాలం ఆయుధాలే వాడతారేమో మరి తాలిబన్ లు. ఏది ఏమైనా పాక్ అమెరికా ఆయుధాలను మరికాస్త పరిశోధించి అలాంటి ఆయుధాలే తయారీ చేసుకుంటే కాస్త డిమాండ్ అన్నా ఉండేది, కానీ సంతలో లేదా ఏదో ఆయుధాల మేళా లాగా అమ్మేస్తుంది.

పాక్ బహుశా ఆ ఆయుధాలను అమ్ముకుని వచ్చిన దానితో ప్రభుత్వాన్ని నడపాలని చూస్తుందేమో..! పాక్ పరిస్థితి కూడా అలాగే ఉంది చూడబోతే. చైనా కు చాలా దేశాలు బలైపోయాయి కానీ ఇంతకాలమైనా తేరుకోకుండా దాన్నే నమ్ముకుని ఉన్న ఒకే ఒక్క దేశం పాక్.  అంత గొప్పగా దానిని నమ్మడానికి వెనుక ఉద్దేశ్యం ఏమిటో మరి. చైనా తో కలవనప్పుడు పాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ప్రపంచం ముందు తీవ్రవాద ప్రేరేపిత దేశంగా గొప్ప స్థాయికి తీసుకెళ్లింది చైనా. ఇప్పుడు పాక్ పరిస్థితి ఇలా ఎవరి వస్తువులో అమ్ముకొని దానితో పూట గడుపుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: