ప్రపంచ దేశాలకు ఆఫ్ఘన్ ను చూస్తుంటే కళ్ళు చెమర్చక మానవు. అక్కడ ప్రజల జీవితాలు అలా ఉన్నాయి మరి. ఒక్కటి రెండు అయితే అనుకోవచ్చు, అనేక సంక్షోభాలతో అక్కడ కనీసం తినడానికి తిండి లేక కొద్ది కాలంలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పిల్లలు ఒక మిలియన్ ఉన్నట్టు ఇప్పటికే యూనిసెఫ్ స్పష్టం చేసింది. దీనిని బట్టే అక్కడ ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో అర్ధం అవుతుంది. తాలిబన్ లు తెగబడి ఆక్రమించుకుంటున్నప్పుడు కళ్ళు అప్పగించి చుసినప్పటి ప్రపంచం కాదు ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు తాలిబన్ ల పరిపాలన గురించి స్పష్టంగా అర్ధం చేసుకున్న ప్రపంచం మెల్లిగా ఆఫ్ఘన్ చర్యలను ఖండిస్తూ వస్తుంది. ఒక్క అమెరిగా అయితే తాలిబన్ లను నిలువరించలేకపోవచ్చు కానీ, ప్రపంచం మొత్తం కలిసి వస్తే వాళ్ళు ఎంత, వాళ్ళ బ్రతుకు ఎంత!

ఈ నేపథ్యంలోనే తాజాగా జి20 దేశాలు విర్చువల్ గా కేవలం ఆఫ్ఘన్ ప్రజల కోసమే సమావేశం అవడం ప్రపంచదేశాలలో మార్పు మొదలైందని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో భారత ప్రధాని కూడా ప్రసంగించారు. ప్రపంచం ఆఫ్ఘన్ కోసం అండగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. ఆఫ్ఘన్ లో ప్రజలను అందరు కలిసి ఆదుకోవాల్సిన అత్యవసరం పడిందని ఆయన అన్నారు. ఈ విషయంపై త్వరగా ప్రపంచ దేశాలు ఒక నిర్ణయానికి వస్తేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాలిబన్ సహా ఏ తీవ్రవాద సంస్థకో ఆఫ్ఘన్ భూభాగమే కాదు, ఏ భూభాగమైన ఇచ్చి చూస్తూ కూర్చోవడం ప్రపంచ దేశాలు చేయరాదని ఆయన అన్నారు.  

ఇప్పటికే ఐరాస ఆఫ్ఘన్ పై విచారణ జరపాలని తీర్మానించుకుంది. దీని కోసం ఈ సమావేశంలో కూడా ఆయా దేశాల అభిప్రాయాలు తెలుసుకుంది. అందరు కలిసి ఆఫ్ఘన్ కు పూర్వస్థితి తెలగలిగితే సంతోష దాయకమని వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్టే తెలుస్తుంది. మరోవైపు తాలిబన్ లు కూడా తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఏ కార్యక్రమం ఎవరు చేపట్టిన ఎవరిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తాజాగా అమెరికా ప్రతినిధులతో చర్చలతో తాలిబన్ లు పాల్గొన్నప్పటి మాట అది. దీనితో ఐరాస నుండి ఆయా దేశాలు తమ సాయాన్ని ఆఫ్ఘన్ ప్రజలకు చేయాలని ముందుకు వస్తున్నాయి. దీనితో బహుశా తాలిబన్ ల పీడ ప్రపంచానికి వదిలిపోవచ్చేమో అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: