త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఏ ఎమ్మెల్యే ఛాన్స్ కొట్టేస్తారనేదానిపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జగన్ మొదట్లో చెప్పిన దాని ప్రకారం...రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గ విస్తరణ చేస్తానని చెప్పారు....అంటే జగన్ చెప్పినట్లు ఈ ఏడాది చివరిలో మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉంది. కానీ కరోనా వల్ల కొంత సమయం పోయింది కాబట్టి, మంత్రులకు ఇంకో ఆరు నెలలు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది...కానీ తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, 100 శాతం మార్పులు ఖాయమని చెప్పేశారు.

దీంతో ప్రతి జిల్లాలో ఎవరి ప్లేస్‌లో ఎవరు మంత్రిగా వస్తారనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో డిప్యూటీ సి‌ఎంగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పుష్పశ్రీ వాణి క్యాబినెట్ నుంచి అవుట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. పైగా గత రెండున్నర ఏళ్లలో ఆమె మంత్రిగా గొప్ప పనితీరు ఏమి కనబర్చలేదు. ఈ నేపథ్యంలో ఆమెని సైడ్ చేయడం ఫిక్స్ అని తెలుస్తోంది.

అయితే పుష్పశ్రీ ప్లేస్‌లో అదే జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే రాజన్న దొర మంత్రిగా రావొచ్చని తెలుస్తోంది. రాజన్న దొర....వైఎస్సార్ ఫ్యామిలీకి వీరవిధేయుడు. సాలూరు నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక...రాజన్నకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు.

కానీ ఎస్టీ మహిళా కోటాలో పుష్పశ్రీకి పదవి దక్కింది. ఈ సారి మాత్రం ఎస్టీ కోటాలో రాజన్నకు పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. జగన్ కూడా రాజన్నకు పదవి ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. కాకపోతే ఎస్టీ కోటాలో మరికొందరు ఎమ్మెల్యేలు సైతం క్యాబినెట్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నారు. కానీ జగన్ మాత్రం రాజన్న వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఈ సారి రాజన్నకు జగన్ ఛాన్స్ ఇస్తారో లేదో?  

మరింత సమాచారం తెలుసుకోండి: