అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన నియోజకవర్గాల్లో కళ్యాణదుర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో టి‌డి‌పి అయిదుసార్లు విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో టి‌డి‌పికి ఊహించని ఓటమి ఎదురైంది. జగన్ గాలిలో కళ్యాణదుర్గం నుంచి వైసీపీ తరుపున ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ గెలిచారు. ఇక ఉషశ్రీ ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నర ఏళ్ళు అవుతుంది....మరి రెండున్నర ఏళ్లలో ఉషశ్రీ పనితీరు ఎలా ఉందనే విషయాన్ని ఒక్కసారి గమనిస్తే....ఉషశ్రీకు మరి పాజిటివ్ లేదు.. అలా అని నెగిటివ్ కూడా లేదు. అంటే ఉషశ్రీకు ఎమ్మెల్యేగా యావరేజ్ మార్కులు పడుతున్నాయి.

ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ఉషశ్రీకు పెద్ద ప్లస్ అవుతున్నాయి...అలాగే ఉషశ్రీ ప్రజలకు అందుబాటులో ఉండటంలో కూడా మంచి మార్కులే పడుతున్నాయి. అయితే సమస్యల పరిష్కరించడంలో ఉషశ్రీకు పెద్దగా మంచి మార్కులు పడటం లేదు. నిధుల కొరత ఉండటంతో అనుకున్న మేర పనులు చేయలేకపోతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చలేకపోతున్నారు.

అలాగే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న తాగునీటి సమస్యలకు చెక్ పెట్టలేకపోతున్నారు. కొన్ని చోట్ల రోడ్ల పరిస్తితి కూడా అధ్వాన్నంగా ఉంది. అటు రైతులకు పెద్దగా ఒరిగింది కూడా ఏమి లేదు. రాజకీయంగా వస్తే అధికార పార్టీ కాబట్టి పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించింది. అయితే ఈ ఫలితాలని చూసి హడావిడి చేస్తే వైసీపీకే ఇబ్బంది.


ఎందుకంటే ఇక్కడ టి‌డి‌పి కూడా బలంగానే ఉంది. ఎలాగో ఆ పార్టీకి కంచుకోటగా ఉంది...ఈ రెండున్నర ఏళ్లలో ఇక్కడ టి‌డి‌పి బాగానే పుంజుకున్నట్లు కనిపిస్తోంది. టి‌డి‌పి నేత ఉమామహేశ్వరనాయుడు యాక్టివ్ గానే పనిచేస్తున్నారు...ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు...పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఇంకా ఇలాగే మరో రెండున్నర ఏళ్ళు కష్టపడితే కళ్యాణదుర్గంలో టి‌డి‌పి పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఉషశ్రీ ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తే వైసీపీకి ప్లస్ అవుతుంది. చూడాలి మరి కళ్యాణదుర్గంలో ఉషశ్రీకి రెండోసారి ఛాన్స్ వస్తుందో లేదో.  


మరింత సమాచారం తెలుసుకోండి: