బ‌తుకు ఇచ్చే త‌ల్లికి తొలి వంద‌నం చేసి వ‌చ్చాక చేసుకునే పండుగ. బతుక‌మ్మ బ‌తుక‌మ్మ ఉయ్యాలో అని పాడుకునే పాట మ‌న నేల‌ను పుల‌క‌రింప‌జేస్తుంది. ప్ర‌కృతి పండుగ. ప్ర‌కృతి మ‌ధ్య చేసుకునే పండుగ‌. త‌ల్లులకు పండుగ, క‌న్నె పిల్ల‌ల‌కు పండుగ. పూల‌ను పేర్చి చేసే పండుగ. తీరున్కొక్క పూల‌తో నా తెలంగాణ దారులలో గొప్ప క‌ళ, కాంతి విక‌సింప‌జేసే పండుగ. పండుగ అంటే పేద‌ల‌కు పెద్ద‌ల‌కు అంద‌రికీ క‌ల‌ల‌ను నెర‌వేర్చే పండుగ. సంస్కృతిని పెంపొందించే పండుగ. తెలంగాణ‌లో కొంద‌రి జీవితాల‌ను మార్చిన పండుగ కూడా ఇదే! అవును! అతిశ‌యం లేదు. అతిశ‌యం కాదు. ఆ పండుగ‌తోనే ఎంద‌రో క‌ళాకారుల‌కు కొత్త వెలుగు కూడా వ‌చ్చింది. ఓ ప్రాంత సంస్కృతికి దేశం త‌లొగ్గి ప్ర‌ణ‌మిల్లింది. మా ఆంధ్రా నేల‌లు ఆ పండుగ పాట విని పుల‌కించిపోయాయి. ఇలాంటి పండుగ ఏటా వ‌స్తూ ఎన్నో సంగ‌తులు తెస్తోంది. కానీ రాజ‌కీయం మాత్రం కొన్ని విభేదాలు సృష్టిస్తుంది. నిర‌స‌న‌కు, పొగ‌డ్త‌కు బ‌తుక‌మ్మ పాటే మాధ్య‌మం కావడం, ముఖ్య భూమిక కావ‌డం ఇటీవ‌ల మార్పు. ఈ మార్పును ష‌ర్మిల అందుకున్నా రు. పాట ఒక‌టి సిద్ధం చేయించి ఇవాళ అన‌గా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేశారు. ఈ పాట‌లో ఆమె బ‌తుక‌మ్మ ఆడారు. బతుక‌మ్మ‌ను పూల‌తో తీర్చిదిద్దారు.


తెలంగాణ సంస్కృతికి సంబంధించి ఎన్నో పండుగ‌లు ఉన్నా బ‌తుక‌మ్మ పండుగ‌కు ఉన్న ప్ర‌త్యేక‌తే వేరు. పిల్లా పాప‌ల‌తో ఆడే ఆట, బ‌తుకమ్మ‌ల‌ను తీర్చిదిద్ది త‌ల్లి గౌర‌మ్మ‌ను కొలిచే పాట. ఇవ‌న్నీ బ‌తుక‌మ్మ‌కే ప్ర‌త్యేక‌త‌లు. అమ్మ‌ను కొలిస్తే అన్నీ వ‌రిస్తాయి అని న‌మ్ముకుని శ్ర‌మ జీవులు సాగించే ఆట, పాట బ‌తుక‌మ్మ. తెలంగాణ వాకిట ఈ పండుగ‌కు ఉన్న ఔన్న‌త్యాన్ని పెంపొందింపజేశారు క‌విత. త‌న సంస్థ తెలంగాణ జాగృతి ద్వారా ఎంద‌రినో జాగృతం చేశారు. దేశ‌విదేశాల్లో ఈ పండుగకు ఉన్న ప్ర‌త్యేక‌త‌ను వివ‌రించి, సంస్కృతి గొప్ప‌ద‌నం చాటారు. ఇదే సంద‌ర్భంలో తెలంగాణ ఉద్య‌మానికి ఈ పండుగ‌కు ఉన్న అనుబంధం కూడా ఎంతో! ఉద్య‌మ వేళ తెలంగాణ సంస్కృతి ఇది..పాట ఇది..అని అంతా గొప్ప స్థాయిలో చెప్పుకునేలా చాటారు క‌విత. ఓ సంద‌ర్భంలో క‌విత‌కు ఎంతో పేరు తెచ్చింది ఈ పండుగ‌.

తెలంగాణ అస్తిత్వంకు సంబంధించి వ‌చ్చిన సందేహాలు అన్ని పంటాపంచ‌లు చేసిన గొప్ప సంద‌ర్భాలు ఎన్నో వ‌చ్చాయి ఆమె జీవితాన‌! ఏ మాట‌కు ఆ మాట క‌విత చేసిన ప్ర‌య‌త్నాల్లో క‌వులు ఉన్నారు. క‌ళాకారులున్నారు. బ‌తుక‌మ్మ‌పై పెద్ద అధ్య‌యన‌మే  సాగింది. కాల గ‌తి గొప్ప‌ది క‌దా! క‌విత స్థానంలో ష‌ర్మిల వ‌చ్చారు. అప్ప‌ట్లో ష‌ర్మిల ఎక్క‌డున్నారో తెలియ‌దు. ఆమెకు ఈ సంస్కృతి తెలుసున‌ని కొంద‌రు అంటారు. తెలిస్తే మంచిదే! కానీ అప్పుడు ష‌ర్మిల ఎందుకు ఈ  పండుగ పై మాట్లాడ‌లేక‌పోయారు. బిడ్డ‌లు నేల రాలుతున్న వేళ అప్పుడు మాత్రం ఎందుకు ఇలాంటి ఓ నిర‌స‌న పాట ఏపూరి సోమ‌న‌తో పాడించ‌లేక‌పోయారు. ఇప్పుడు వైఎస్సార్టీపీ నిర‌స‌న‌ల ద్వారా బ‌తుకమ్మ పాట వినిపిస్తే, స‌మ‌స్య‌లు తీరిపోవు కానీ కాస్త‌యినా పాల‌కులు శ్ర‌ద్ధ చూపుతారు అన్న భావ‌న బాగుంది కానీ ఇదే స్పృహ తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఎందుకు లేకుండా పోయింది ?


మరింత సమాచారం తెలుసుకోండి: