తెలంగాణ రాజకీయాల్లో మ‌హిళా ఫైర్ బ్రాండ్ గా ఉన్న లేడీ అమితాబ‌చ్చ‌న్ రాజ‌కీయంగా గ‌త కొంత కాలంగా సైలెంట్‌గా ఉండ‌డం ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. విజ‌య‌శాంతి ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారుతూ వ‌చ్చారు. ముందుగా బీజేపీ లో ప్ర‌స్థానం ప్రారంభించిన ఆమె ఆ త‌ర్వాత ప్ర‌త్యేక తెలంగాణ కోసం బీజేపీతో విబేధించి త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. చివ‌ర‌కు 2009 ఎన్నిక‌ల‌కు ముందు ఆమె ఆ పార్టీని కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ ఎస్ లో విలీనం చేసి గులాబీ పార్టీ టిక్కెట్ పై మెద‌క్ ఎంపీ గా పోటీ చేసి మ‌రీ విజయం సాధించారు. 2014లో విజ‌య‌శాంతి కేసీఆర్ ప‌క్క‌న పెట్ట‌డంతో కాంగ్రెస్ కండువా క‌ప్పుకుని మెద‌క్ ఎమ్మెల్యే గా పోటీ చేసి ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఆమె ఆ త‌ర్వాత పేరుకు మాత్ర మే కాంగ్రెస్‌లో ఉన్నారే త‌ప్పా ఆమె వ‌ల్ల కాంగ్రెస్‌కు ఒరిగిందేమి లేదు. అయితే 2018 ముంద‌స్తు సాధార‌ణ ఎన్నిక‌ల‌లో మాత్ర‌మే ఆమె కాస్త బ‌య‌ట‌కు వ‌చ్చి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన కొంద‌రు అభ్య‌ర్థుల‌కు ప్ర‌చారం చేశారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో విజ‌య‌శాంతి మ‌ళ్లీ బ‌య‌ట‌కు రాలేదు. త‌ర్వాత కాంగ్రెస్ కు తెలంగాణ లో లైఫ్ లేద‌ని విమ‌ర్శిం చ‌డంతో పాటు ఆమె ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కాషాయ కండువా క‌ప్పుకున్నారు.

ఇక్క‌డ కూడా ఆమె త‌న‌కు అంద‌లం ఉంటుంద‌ని.. త‌న‌ను ఆకాశంలో కూర్చో పెడ‌తార‌ని ఆశించారు. అయితే ఇక్క‌డ ఆమెను ప‌ట్టించుకున్న నాథుడే లేడు. రాజ్య‌స‌భ ఆశ‌లు పెట్టుకున్నా బీజేపీ ఆమెకు ఏ మాత్రం సీటు ఇచ్చే ఛాన్స్ లేదు. దీంతో ఆమె గుర్తు వ‌చ్చిన‌ప్పుడు మీడియా ముందుకు వ‌చ్చి కేసీఆర్ పై చిన్నా చిత‌కా విమ‌ర్శ‌లు చేస్తూ కాలం గ‌డుపు తున్నారు. ఇక బతుకమ్మ వేడుకల్లో ఆమె క‌న‌ప‌డ లేదు.

నాగార్జునా సాగర్ ఉప ఎన్నికల తర్వాత పూర్తి గా సైలెంట్ అయిపోయిన వాతావ‌ర‌ణ‌మే ఉంది. మ‌రో వైపు . మహిళా నాయకులతో సమావేశాలు లేవు. దీంతో మ‌రోసారి ఆమె రాజ‌కీయ ప్ర‌యాణంపై కొత్త ఊహాగాన‌లు మొద‌ల‌య్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: