హైదరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని టిఆర్ఎస్ పార్టీ పట్టుదలగా కష్టపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈటెల రాజేందర్ ను ఈ ఎన్నికల్లో ఓడించడం ద్వారా ఆయనకు ప్రజల్లో ఆదరణ లేదు అనే విషయాన్ని బలంగా చెప్పాలని మంత్రి హరీష్ రావు తీవ్రంగా కష్టపడుతున్నారు. రాజకీయంగా  ఈటెల రాజేందర్  కు హైదరాబాద్ లో తిరుగు లేదని బీజేపీ నేతలు ధీమాగా ఉన్న తరుణంలో ఆయన విషయంలో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చాలా పకడ్బందీ గా ముందుకు వెళ్తూ పార్టీ కీలక నేతలు బాధ్యతలు అప్పగించింది.

ప్రస్తుతం  ఈటెల రాజేందర్  హుజురాబాద్ లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించి ఎలాగైనా సరే ఎన్నికల్లో విజయం సాధించాలని జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు సహకారం అందించిన లేకపోయినా సరే ఎన్నికల్లో ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీని గెలిపించి అసెంబ్లీలోకి ఆ పార్టీ నుంచి అడుగుపెట్టాలని  ఈటెల రాజేందర్  పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో ఆయన చేస్తున్న కామెంట్స్ బాగా హైలెట్ అవుతూ వస్తున్నాయి. ఇటీవల ఈటెల రాజేందర్  ప్రచారంలో ఒక డైలాగ్ వదిలారు.

తాను ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేస్తారా అంటూ ఆయన సవాల్ చేశారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుంది అనే కామెంట్స్ ఎక్కువగా రాజకీయ వర్గాల్లో కనబడుతున్నాయి.  ఈటెల రాజేందర్  చేసిన సవాలుకు ఇప్పటివరకు మంత్రి హరీష్ రావు గాని లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ ఎక్కడా కూడా స్పందించలేదు. మంత్రి కేటీఆర్ కూడా దీనిపై స్పందించడానికి పెద్దగా ఇష్టపడలేదు.  ఈటెల రాజేందర్  సవాలు చేసిన దగ్గర్నుంచి కూడా మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో ఎక్కువగా తిరగడమే కాకుండా ప్రసంగాల్లో కాస్త జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. మరి టిఆర్ఎస్ పార్టీ  ఈటెల రాజేందర్  డైలాగ్ ను ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: