ఆంధ్రప్రదేశ్ లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యవహారాల విషయంలో పట్టు పెంచుకునే క్రమంలో అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పార్టీ నాయకులను కట్టడి చేయడమే కాకుండా తన మాటే వినాలని ఉంది గా కొంత మంది ఎమ్మెల్యేలను కూడా ఇబ్బంది పెడుతున్నారు అని చాలామంది నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేశారు. చివరకు సొంత జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నారు అనే అభిప్రాయం కూడా చాలామందిలో వ్యక్తమవుతోంది.

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఈ మధ్య కాలంలో కాస్త పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీ నేతలతో కూడా ఆయన మంచి సంబంధాలను పెంచుకునే విధంగానే కష్టపడుతూ ఉన్న  విషయం కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక నియోజకవర్గంలో ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ పెరగడమే కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా ఆయనతో చాలా మంది నాయకులు సన్నిహితంగా ఉండటం అచ్చెంనాయుడుకి ఏమాత్రం కూడా నచ్చటం లేదు అనే భావన వ్యక్తమవుతోంది. దీంతో బెందాళం అశోక్ చేస్తున్న కార్యక్రమాలను అచ్చెన్నాయుడు కంట్రోల్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు.

నియోజకవర్గంలో ఆయన చేస్తున్న కార్యక్రమాల విషయంలో అచ్చెన్నాయుడు ఆరా తీస్తున్నారని ఒక రకంగా బెందాళం అశోక్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి కూడా నిఘా పెట్టారని ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఏంటనేది అచ్చేనాయుడు ఎప్పటికప్పుడు వివరాలు కూడా సేకరించి ముందుకు వెళ్తున్నారు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో బెందాళం అశోక్ చాలా సీరియస్ గా ఉండటమే కాకుండా ఇదే వైఖరి కొనసాగితే మాత్రం తాను పార్టీలో కొనసాగడం ఇలాంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటే మాత్రమే ఇబ్బందికరంగా మారుతుంది అని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసే అవకాశాలు ఉండవచ్చు అనే అంశాన్ని చెప్పారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: