ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఆచంట‌. ఇది టీడీపీకి కంచుకోట వంటి నియోజ‌క వ‌ర్గం. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకుంది. సీనియ‌ర్ నాయ‌కుడు.. శ్రీరంగ నాథ రాజు ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు. అయితే.. ఇప్పుడు వైసీపీ ప్ర‌భ మ‌స‌క బారుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మంత్రి ఆయ‌న దూకుడు ఉన్నా.. ప్ర‌తి విష‌యంలోనూ క‌మీష‌న్ల వ్య‌వ‌హారం న‌డుస్తోం ద‌నే గుస‌గుస వినిపిస్తోంది. ప్ర‌తి ఒక్క‌రికీ అందుబాటులో ఉంటాన‌ని చెప్పిన ఆయ‌న ఇప్పుడు కొంద‌రికి మాత్ర‌మే అందుబాటులో ఉండ‌డం.. కుమారుడి హ‌వా.. సాగుతుండ‌డంతో.. రాజుగారి ప్ర‌భ మ‌స‌క‌బారుతోంది.

పైగా యువ నేత‌ల‌ను ఆయ‌న ఎద‌గ‌నివ్వ‌డం లేద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. దీంతో వైసీపీ నేత‌లు.. ఎవ‌రూ యాక్టివ్‌గా లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిషత్ ఎన్నిక‌ల్లో ఆచంట మండ‌లం వైసీపీ కోల్పోయిందంటే.. మంత్రి ప్ర‌భావం ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. అదేస‌మయంలో మాజీ మంత్రిటీడీపీ నాయ‌కుడు.. పితాని స‌త్య‌నారాయ‌ణ దూకుడుగా ఉన్నారు. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న తెర‌చాటు వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. పార్టీని, నాయ‌కుల‌ను కూడా ముందుండి న‌డిపిస్తున్నాయి. కొన్నాళ్ల కింద‌ట‌.. ఆయ‌న వైసీపీలో చేరిపోతున్నార‌నే ప్ర‌చారం జ‌రిగినా.. ఆయ‌న టీడీపీలో ఉండ‌డం క‌లిసి వ‌స్తోంది.

అదేస‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల‌ను కూడా దీటుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. పార్టీ ఉన్న బ‌ల‌మైన ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 12 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన పితాని.. త్రిముఖ పోటీలోనూ బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. అయితే.వ చ్చే ఎన్నిక‌ల్లో క‌నుక టీడీపీ -జ‌న‌సేన‌లు క‌లిసి పోటీ చేస్తే.. ఈ టికెట్‌ను పితానికే కేటాయించ‌నున్నారు.

దీంతో ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. వచ్చే ఎన్నిక‌ల్లో రంగ‌నాథ‌రాజును ప‌క్క‌న పెట్టినా.. ఆయ‌న వేసిన‌.. అడుగులు చెరిగిపోవ‌డంతో.. పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: