ఏపీలో గ‌త ఎన్నిక‌ల‌లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు మరో రెండేళ్లలో జరగనున్న తెలంగాణలో పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్దమవుతున్నార‌ని తెలుస్తోంది. తెలంగాణ లో పార్టీ బ‌ల‌ప‌డాల‌న్నా అస‌లు ఆ పార్టీ గురించి ఇక్క‌డ చ‌ర్చించు కోవాల‌న్నా కూడా ఇక్క‌డ జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక ప‌వ‌న్ కూడా ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక ల‌లో పోటీ చేసేందుకు ప్లాన్ రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ సారి ప‌వ‌న్ తెలంగాణ ఎన్నిక ల‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల ర‌ణ రంగంలోకి దిగుతార‌ని అంటున్నారు. ఏపీలో ఇప్ప‌టికే రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉంది. తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక ల‌లో నూ జ‌న‌సేన పోటీ చేయ‌లేదు. అక్క‌డ నుంచి మిత్ర‌ప‌క్ష మైన బీజేపీ పోటీ చేసింది. ఇక బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేన పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో బీజేపీయే పోటీ చేస్తోంది. అయితే గ్రేట‌ర్ హైద‌రాబా ద్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేయ‌కుండా బీజేపీకి స‌పోర్ట్ చేసింది.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో మాత్రం జ‌నసేన తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు రెడీ అవుతోంది. ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన + బీజేపీ పొత్తు ఉంటుంద‌ని రెండు పార్టీల నేత‌లు అంటున్నారు. అయితే బీజేపీ నేత‌లు మాత్రం తాము జ‌న‌సేన తో క‌లిసి పోటీ చేసినా ఉప‌యోగం ఉండ‌ద‌ని.. ఒంట‌రిగా పోటీ చేస్తేనే ఎక్కువ స్థానాలు గెలుచు కుంటామ‌ని చెపుతున్నారు.

ఇక తెలంగాణ‌లో ప‌వ‌న్ అభిమానులు ఎక్కువుగా ఉన్న ప్రాంతా ల‌తో పాటు ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం అయిన మున్నూరు కాపు ఓటు బ్యాంకు ఎక్కువుగా ఉన్న స్థానాల్లో జ‌న‌సేన పోటీ చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. మ‌రి జ‌న‌సేన ఆశ ఎలా ఉన్నా బీజేపీ ఏం చేస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: