విష్ణు చ‌క్రం తిర‌గ‌డం లేదు!-విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రిని ప‌ల‌క‌రించినా.. ఇదే వాద‌న వినిపిస్తోంది. ఒక‌ప్పుడు.. ఎమ్మెల్యే విష్ణు.. అంటే.. పిలిస్తే.. ప‌లికే నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న అంద‌రికీ అందుబాటులో ఉన్నారు. కానీ, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీలో చేరి గెలిచిన త‌ర్వాత‌.. ఆయ‌న కేవ‌లం వ్యాపారాలు.. పార్టీ కార్య‌క్ర‌మాల వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఏ చిన్న అవ‌స‌రం వ‌చ్చినా.. ఎమ్మెల్యే రావ‌డం లేద‌ని.. క‌నీసం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని .. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి విష్ణుకు మాస్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయ‌న హ‌యాంలో కొన్ని కాల‌నీలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పేద‌ల‌కు ఇళ్లు ఇచ్చారు. ఇది గ‌డిచిన చ‌రిత్ర‌. దీంతో ఆయ‌న‌కు మంచి ఓటు బ్యాంకు కూడా ఏర్ప‌డింది. ఇదే గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు గెలిచే అవ‌కాశం ఇప్పించింది. స్వ‌ల్ప మెజారిటీతోనే గెలిచినా. మాస్ ఓటు బ్యాంకును సొంతం చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు అదే మాస్‌కు ఆయ‌న దూర‌మ‌వుతు న్నారు. గ‌తంలో ఎమ్మెల్యే ఆఫీస్‌కు వెళ్తే.. క‌నిపించేవారు.. ప్ర‌జ‌ల మాట వినిపించుకునేవారు. కానీ, ఇప్పుడు ఆయ‌న ఎక్క‌డా ద‌ర్శ‌న మివ్వ‌డం లేదు. ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు.

ఇదేస‌మ‌యంలో వైసీపీలోనూ నాయ‌కుల‌కు, పార్టీ కార్య‌కర్త‌ల‌కు కూడా అందుబాటులో లేకుండా పోయార నే వాద‌న వినిపిస్తోంది. దీంతో సెంట్ర‌ల్ ప‌రిధిలో విష్ణు చ‌క్రం తిరగ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కు లు. ముఖ్యంగా బ్రాహ్మ‌ణ సామాజిక‌వ ర్గానికి చెందిన కార్పొరేష‌న్‌ను బీసీ సంక్షేమ శాఖ‌లో చేరుస్తూ.. ఇటీవ ల జీవో తెచ్చిన‌ప్పుడు కూడా ఎమ్మెల్యే మౌనంగా ఉన్నారు. క‌నీసం స్పందించ‌లేదు. అదేస‌మ‌యంలో చాలా మందికి పింఛ‌న్లు ఎత్తేశారు. ఈ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు కూడా ఆయ‌న అందుబాటులో లేకుండా పోయారు.

మ‌రి ఇలా అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా ఓట్లు వేస్తామ‌ని.. ఇక్క‌డి వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. ఎమ్మెల్యే ప్ర‌జ‌ల్లో ఉంటారా?  లేక వ్యాపారాల కోసం హైద‌రాబాద్‌లోనే ఉంటారా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఏం చేస్తారో చూడాలి. మ‌రోవైపు.. టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా దూకుడు పెరుగుతోంది. మాస్‌కు మ‌రింత చేరువ అవుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన‌న చిన్న‌పాటి త‌ప్పుల‌ను కూడా స‌రిచేసుకునే ప‌నిలో ఉన్నారు. ఈ ప‌రిస్థితిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ల్లాది విష్ణు ర‌న్న‌ర‌ప్‌గా మిగిలిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: