తెలంగాణ భవన్ లో కాసేపట క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. అయితే.. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సారి మనం ముందస్తుకు వెళ్లడం లేదని.. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని పార్టీ నేతలకు చెప్పారు సీఎం కేసీఆర్‌. ఇంకా రెండేళ్లు ఉంది అన్ని పనులు చేసుకుందామని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు.  మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయండి.. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నామని స్పష్టం చేశారు గులాబీ బాస్‌ కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు.  

హుజురాబాద్ ఎన్నిక‌ల ప్రచారం స‌భ‌ కు తాను వస్తానని పార్టీ నేతల తో ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. అంతేకాదు.. ఈ నెల 26 లేదా 27వ తేదీల్లో పాల్గొంటా నని పా ర్టీ నేతల కు స్పష్టం చేశా రు సీఎం కేసీ ఆర్‌.  తెలంగాణ విజయ గర్జన సభ విపక్ష పార్టీల దిమ్మ తిరిగేలా నిర్వహిద్దామని నొక్కి చెప్పారు సీఎం కేసీ ఆర్.  

ఈ సారి జరిగే... టిఆ ర్ఎస్ ప్లీనరీకి 6500 మంది ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్పం చేశారు సీఎం కేసీఆర్‌. హుజురాబాద్‌ నియోజక వర్గంలో గెల్లు శ్రీనివా స్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరని...  పార్టీ నేతలతో సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం అందుతోంది. హుజురాబాద్‌ నియోజక వర్గం లో జరిపిన అన్ని సర్వే ల్లోనూ...  టీఆర్‌ ఎస్‌ పార్టీ కే అను కూలంగా వచ్చా యని స్ప ష్టం చేశారు సీఎం కేసీ ఆర్‌.  అయి తే.. ప్రచా రాన్ని గ్రామ స్థాయి లో చేయాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ సారి కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలని ప్లాన్‌ చేయాలని సీఎం కేసీ ఆ ర్‌ చెప్పారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: