ఇక DRDO యొక్క డిఫెన్స్ జియోఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DGRE), చండీగఢ్ ద్వారా అప్రెంటీస్ పోస్ట్ ల కోసం దరఖాస్తులు అనేవి ఆహ్వానించబడ్డాయి. ఇక ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రకటన జారీ చేసిన తేదీ నుండి 21 రోజుల్లోపు ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వారి అధికారిక వెబ్‌సైట్ http://www.drdo.gov.in లో సెప్టెంబర్ 27 వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయబడటం జరుగుతుంది.ఇక అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 48 అప్రెంటీస్ పోస్టులు అనేవి భర్తీ చేయబడతాయి.ఇక ఇందులో 28 ఐటిఐ అప్రెంటీస్ పోస్టులు ఇంకా అలాగే 18 డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు ఇంకా అలాగే 2 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు విషయానికి వస్తే...డిప్లొమా అప్రెంటీస్ - అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమాని కలిగి ఉండాలి.

ఇక ITI అప్రెంటీస్ కి అభ్యర్థులు సంబంధిత రంగంలో తప్పనిసరిగా ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

ఇక గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ కి అభ్యర్థులు మ్యాథ్స్ / స్టాటిస్టిక్స్ / ఫిజిక్స్ నుండి B.Sc డిగ్రీని కలిగి ఉండాలి.

ఇక ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే..మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఎటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించకూడదని పరిపాలన నిర్ణయించడం జరిగింది.

ఇక జీతం విషయం వస్తే : గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ కోసం అభ్యర్థులకు నెలకు రూ. 9000 స్టైఫండ్ అనేది ఇవ్వబడుతుంది. ఇక డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు రూ .8000 ఇంకా ITI అప్రెంటీస్ పోస్ట్ కోసం నెలకు రూ .7000 జీతంని పొందుతారు.

ఇక దరఖాస్తు ప్రక్రియ విషయానికి వస్తే.. గ్రాడ్యుయేట్ ఇంకా డిప్లొమా అప్రెంటిస్ అభ్యర్థులు http://www.mhrdnats.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ITI అప్రెంటిస్ అభ్యర్థులు వచ్చేసి http://www.apprenticeshipindia.org లో నమోదు చేసుకోవచ్చు.కాబట్టి అర్హత అలాగే ఆసక్తి వున్న అభ్యర్థులు వెంటనే వీటికి అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: