శ్రమించడంలో వెనుకబడిన  రాష్ట్రం ఏది ?

 
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం ఈ -శ్రమ పోర్టల్ ను ప్రవేశపెట్టింది. ఇదంలో వ్యవసాయ రంగంతో పాటు, నిర్మాణ రంగం తదితర రంగాలలోని అసంఘటిత కార్మికులు తమ పేర్లు నమోదుచేసుకోవాలని సూచించింది. అయితే  వివిధ రాష్ట్రాలనుంచి  ఈ పోర్టల్ లో నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. కాగా  ఈ వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో  ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడి ఉంది.
వలస వాసులు ఎక్కుువగా ఉండే బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల కార్మికులు అత్యధికంగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ నాలుగు కోట్ల మంది కి పైగా కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపింది. ఇందులో యాభై శాతానికి పైగా మహిళలు తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషమని కూడా ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి పథకాలు నేరుగా లబ్ది దారులకు చేరువయ్యేలా  చేసేందుకు  ఈ-శ్రమ పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. కార్మికులకు ముఖ్యంగా అసంఘటిత రంగంలో చేమటోడ్చి పనిచేస్తున్న వారికి ఉపయోగంగా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకు వచ్చినట్లు  కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.  ఇందులో నమోదు చేసుకున్న కార్మికులకు ఆధార్ కార్డు లాగా ఒక ప్రత్యేక నంబర్ ను కేటాయిస్తారు. ఇది దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. పొట్టకూటి కోసం ఏ రాష్ట్రంలో పని చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి  ప్రయోజనాలు అందుకునే వీలవుతుంది.  ప్రస్తుతం ఇతర రాష్ట్రాలలో పనులుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి  అక్కడి రాష్ట్రాలు ఏలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు అందించడం లేదనే అపవాదు ఉంది. దీనిని అధికమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ పోర్టల్ ను అందుబాటు లోనికి తీసుకు వచ్చింది.  ఈ-శ్రమ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకు ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది.  దేశంలో ఎక్కడైనా ప్రమాద వశాత్తు మరణిస్తే రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది.  మరణం అంచుల దాకా వెళ్లి వైకల్యం పొందిన వారికి లక్ష రూపాయల వరకూ  పరిహారం లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ-శ్రమ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు ముందుకు వచ్చారు.
మరింత సమాచారం తెలుసుకోండి: