వ‌చ్చే ఎన్నిక‌ల ముంగిట‌.. టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటాయ‌ని.. క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్తాయ‌ని.. కుదిరితే.. బీజేపీని కూడా క‌లు పుకొంటాయ‌ని.. వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌, దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే.. ఇది నిజ‌మా?  నిజ‌మేనా? అనే ఆశ్చ‌ర్యాలు స‌ర్వ‌త్రా ఉన్నాయి. ఇదిలావుంటే.. టీడీపీలో జ‌రుగుతున్న అనూహ్యమైన ప‌రిణా మాలు.. ఈ వార్త‌ల‌ను ధ్రువీక‌రిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. జ‌గ‌న్‌ను అధికారంలో నుంచి దింపేయా లంటే.. ఖ‌చ్చితంగా బ‌లంగానే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం. 2014లో వేసిన ప్లాన్ బెడిసి కొట్టింద‌ని.. ఇప్ప‌టికీ సీనియ‌ర్లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌టిష్ట వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌తో జోడీ క‌ట్టాల‌ని టీడీపీ అధినేత నిర్ణ‌యించుకున్నారు.. ఇక‌, ఇటీవ‌ల ప‌వ‌న్ కూడా రాష్ట్ర `భ‌విష్య‌త్తు` కోసం .. ఖ‌చ్చితంగా ఎవ‌రితో అయినా.. క‌లిసి ప‌నిచేసేందుకు రెడీ అని పేర్కొన్నారు. అంటే.. ప‌వ‌న్ కూడా `సంకేతాలు` పంపేశారు. ఇక‌, మిగిలింది ప్ర‌క‌టనే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే.. దీనిపై ఇప్ప‌టికీ అనేక సందేహాలు.. ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పుల‌ను ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. వీటిలో ప్ర‌ధానంగా.. రెండు మాసాల కింద‌ట వ‌ర‌కు.. జోరుగా వ్య‌వ‌హ‌రించిన నారా లోకేష్‌.. జ‌గ‌న్‌పైనా.. ప్ర‌భుత్వంపైనా విరుచుకుప‌డ్డారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న సైలెంట్ అయ్యారు.

ఇది వ్యూహం ప్ర‌కారం చేస్తున్న‌దేన‌ని విశ్లేష‌కుల మాట‌. ప‌వ‌న్ వాయిస్ హైలెట్ అవ్వాలంటే.. లోకేష్ వాయిస్ త‌గ్గాల‌నేది.. `ఒప్పందం`గా ఉంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న త‌ర్వాత‌.. ప‌వ‌న్‌కు ఓ వ‌ర్గం మీడియాలో ఫాలోయింగ్ త‌గ్గిపోయింది. ఆయ‌న మాట్లాడినా.. పె ద్ద‌గా క‌వ‌ర్ చేయ‌లేదు.కానీ.. టీడీపీతో `పొత్తు` కుదిరేస‌రికి మాత్రం. ప‌వ‌న్‌ను మీడియా హైలెట్ చేస్తోంది. ఆకాశానికి ఎత్తేస్తోంది. ఇదీ చంద్ర‌బాబు వ్యూహంలో భాగ‌మేన‌ని, దీనిని బ‌ట్టి.. ఈ రెండు పార్టీలూ క‌లిసి పోతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. కీల‌క కాపు, క్ష‌త్రియ‌ నేత‌ల‌ను టీడీపీ నుంచి జ‌నసేన‌లోకి వెళ్లేలా.. చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు.

ఫ‌లితంగా.. ప‌వ‌న్ బేస్ పెరిగి.. కాపు వ‌ర్గం అంతా ఆయ‌న‌కు అనుకూలంగా మారుతుంద‌ని.. భావిస్తున్నార‌ట‌. ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్‌కు ఈ వ‌ర్గాల‌ను దూరం చేసేందుకు.. ప‌వ‌న్‌తోనే వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపిస్తున్ఆన‌ర‌ని అంటున్నారు. ఇలా.. మొత్తంగా ప‌వ‌న్ కోసం.. బాబు వ్యూహాత్మ‌క త్యాగాలు చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: